Share News

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓ బ్లాక్‌ మెయిలర్‌

ABN , Publish Date - May 21 , 2024 | 11:48 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న వ్యక్తి ఓ బ్లాక్‌ మెయిలర్‌ అని, అ తడికి మద్దతుగా ఓటు వేయించే విషయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడి ఆలోచించుకోవాలని, లేదం టే వారికే ఎసరు పెడతాడని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓ బ్లాక్‌ మెయిలర్‌

అతడిపై 56 క్రిమినల్‌ కేసులు

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నల్లగొండ, మే 21: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న వ్యక్తి ఓ బ్లాక్‌ మెయిలర్‌ అని, అ తడికి మద్దతుగా ఓటు వేయించే విషయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడి ఆలోచించుకోవాలని, లేదం టే వారికే ఎసరు పెడతాడని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశం లో ఆయన మాట్లాడారు. పొద్దున లేస్తే బూతుపురాణాలు మాట్లాడే అభ్యర్థిని మండలికి పంపితే ఎంత ప్ర మాదమో ప్రతీ ఒక్క పట్టభద్రుడు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిపై 56 క్రిమినల్‌ కేసులు ఉన్నాయన్నారు. బూతు మాటలు, బెదిరింపులు, బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ పెద్దలను తిడితే పెద్దవాడిని అవుతానన్న భావనతో ఉన్న వ్యక్తిని మండలికి పంపించవద్దన్నారు. ప్రభుత్వానికి బాకా ఊదే వ్యక్తిని కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తిని ఎన్నుకోవాలని కోరారు. సన్న ధాన్యానికి మాత్రమే రూ.500బోనస్‌ ఇస్తామని సన్నా యి నొక్కులు నొక్కుతున్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్రంలో 85శాతం వరకు దొడ్డు రకాలు సాగవుతాయని, వాటికి బోనస్‌ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఐదు నెలలోనే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల అపఖ్యాతిని కూడగట్టుకుందన్నారు. గత ప్రభుత్వం 30వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ ఇచ్చి రాత పరీక్షలు నిర్వహిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం తామే ఆ ఉద్యోగాలు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటోందన్నారు. మెగా డీఎస్సీ వేస్తామని, 2లక్షల ఉద్యోగాలని మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పట్టభద్రులంతా సరైన సమాధానం చెప్పాలన్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి మాట్లాడుతూ, పట్టభద్రుల ఉప ఎన్నికలో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి ఎన్నికల సమయంలోనే కనిపిస్తాడని, కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రశ్నిస్తానన్నా గొంతును సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటాడని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేష్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నా రు. సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, నాయకులు ప్రవీణ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూ పాల్‌రెడ్డి, జడ్పీచైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకే్‌షరెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2024 | 11:48 PM