పోటాపోటీ
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:36 PM
లోక్‌సభ సీట్లకు అభ్యర్థుల ఎంపిక కొలిక్కివస్తుండడం తో ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఉమ్మ డి జిల్లాలోని రెండు సీట్లకూ మూడు ప్రధాన పార్టీల నుంచి బలమైన నేతలు టికెట్ ఆశిస్తుండడం, గెలుపే లక్ష్యంగా పార్టీల అధిష్ఠానాలు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుండడంతో టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై రోజుకో సమీకరణం తెరమీదకు వస్తోంది.

ఎంపీ టికెట్ కోసం అన్ని పార్టీల్లో ఆశావహుల యత్నాలు
ఏ క్షణమైనా కాంగ్రెస్ జాబితా
బీఆర్‌ఎ్‌సలో అభ్యర్థిత్వాలపై మల్లగుల్లాలు
బలమైన పోటీకి సిద్ధంగా ఉండాలంటున్న బీజేపీ
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): లోక్‌సభ సీట్లకు అభ్యర్థుల ఎంపిక కొలిక్కివస్తుండడం తో ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఉమ్మ డి జిల్లాలోని రెండు సీట్లకూ మూడు ప్రధాన పార్టీల నుంచి బలమైన నేతలు టికెట్ ఆశిస్తుండడం, గెలుపే లక్ష్యంగా పార్టీల అధిష్ఠానాలు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుండడంతో టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై రోజుకో సమీకరణం తెరమీదకు వస్తోంది. బీజేపీ తొలిజాబితాలో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి బీసీ వర్గానికి చెందిన మాజీ ఎంపీ డాక్టర్ బూరనర్సయ్యగౌడ్‌కు టికెట్ కేటాయించడం, మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి సైతం రెండింటిలో ఒక స్థానంలో బీసీ లేక ఎస్టీ వర్గానికి చెందిన నేతలకు టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనలు అధిష్ఠానం ముందుకు చేరగా, అధికార కాంగ్రె్‌సలోనూ సామాజిక స్వరం వినిపిస్తోంది. రేపోమాపో టికెట్ ఖరారవనుండడంతో ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రె్‌సలో పోటాపోటీ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు ఎం పీ సీట్లను భారీ మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంతో మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశం లో నేతలిద్దరూ ఇప్పటికే అధిష్ఠానానికి స్పష్టమైన ప్రతిపాదనలు చేశారనే చర్చ పార్టీలో సాగుతోంది. రేపోమాపో అభ్యర్థుల ప్రకటన ఉంటుందనే చర్చ నేపథ్యంలో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నల్లగొండ లోక్‌సభ స్థానం నుం చి పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్‌రెడ్డికి లైన్‌క్లియర్ అయినట్లేనని చర్చసాగుతోంది. మరో వైపు పీసీసీ ప్రధాన కార్య దర్శి పటేల్ రమే్‌షరెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్యఅనుచరుడు గుమ్ముల మోహన్‌రెడ్డి సైతం టికెట్‌పై ధీమాగా ఉన్నారు. భువనగిరి స్థానం నుంచి పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని పోటీకి ఆహ్వానించామని మంత్రి కో మటిరెడ్డి ప్రకటించినా, రాహుల్‌గాంధీ పోటీ చేయకపోతే మంత్రి కుటుంబానికి చెందిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సతీమ ణి కోమటిరెడ్డి లక్ష్మి, లేదా మంత్రి సోదరుడి కుమారుడు డాక్టర్ సూర్యపవన్‌రెడ్డిలో ఒకరికి టికెట్ దక్కుతుందనే చర్చసాగుతోంది. ఇదే స్థానం కోసం పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీసీ నినాదంతో చెనగాని దయాకర్‌గౌడ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
బీఆర్‌ఎ్‌సలో మల్లగుల్లాలు
బీఆర్‌ఎస్ నుంచి ఎవరిని బరిలో దింపాలనే అంశంపై ఆ పార్టీ అగ్రనేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి రెండు సీట్లలో ఏదో ఒక చోట తనకు పోటీచేసే అవకాశం దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. నల్లగొండ నుంచి మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ తేరా చిన్నపరెడ్డి సైతం టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్థానంలో గిరిజన, బీసీ ఓటర్లు అధికంగా ఉన్నందున ఆ వర్గాలకు చెందిన నేతలను బరి లో దింపడం ద్వారా కాంగ్రె్‌సను గట్టిగా ఢీకొట్టవచ్చనే అభిప్రాయా న్ని కీలకనేతలు అధిష్ఠానం ముందుంచడంతో ఆ దిశగా పరిశీలన చేస్తున్నారు. ప్రధానంగా బీసీవర్గాల నుంచి సీనియర్‌నేత సుంకరి మల్లేశ్‌గౌడ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయన ఇప్పటికే బీసీ నినాదంతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తూ టికెట్ కోసం ఒత్తిడి తెస్తున్నారు. గతంలోనూ డీసీసీబీ చైర్మన్ పదవి ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోయారని, ఈ సారైనా ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. మరో కీలక నేత చాడ కిషన్‌రెడ్డి సైతం అధిష్ఠానం ఈసారి అవకాశమివ్వాలని, 2001 నుంచి పార్టీలో విధేయతతో ఉన్నానని, ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేశానని, పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలోనూ అవకాశాలు ఇవ్వలేకపోయారని, ఈ దఫా తప్పకుండా పోటీకీ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. గిరిజనవర్గాలకు టికెట్ ఇస్తే మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ప్రముఖ వైద్యు డు డాక్టర్ మాతృనాయక్, ట్రైకార్ మాజీ చైర్మన్ రాంచందర్‌నాయ క్ పేర్లను పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భువనగిరి స్థానంనుంచి అమిత్ రెడ్డితోపాటు ఉద్యమనేత జిట్టా బాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. బీసీ కోటాలో చాన్స్ ఇవ్వాలని శాసనమండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
బలమైన అభ్యర్థిని దింపాలని బీజేపీ పావులు
నల్లగొండ లోక్‌సభ స్థానంలో బీజేపీ నుం చి బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని ఆ పార్టీ భా విస్తోంది. సీనియర్‌నేతలు గొంగడి మనోహర్‌రెడ్డి, గత ఎన్నికల్లో పోటీచేసిన గార్లపాటి జితేంద్రకుమార్, గోలి మధుసూదన్‌రెడ్డి, నూకల నరసింహారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్ట ర్ నాగం వర్షిత్‌రెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్క డ పోటీకి బీఆర్‌ఎస్ నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేను బీజేపీ నేతలు సంప్రదించినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బీసీవర్గ నేత రామరాజు యాదవ్ అభ్యర్థిత్వంపైనా బీజేపీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అనుసరించే వ్యూహానికి దీటుగా తాము అభ్యర్థిని తెరమీదకు తెస్తామని, బలమైన పోటీ ఇస్తామనే వాదన బీజేపీ నేతల నుంచి వస్తోంది.