Share News

భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:28 AM

ఆర్‌ఆర్‌ఆర్‌ భూనిర్వాసితులకు బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం మూడు రేట్లు పరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్‌ చేశారు.

భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి
ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తున్న సీపీఎం నాయకులు

వలిగొండ, జూలై 27: ఆర్‌ఆర్‌ఆర్‌ భూనిర్వాసితులకు బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం మూడు రేట్లు పరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్‌ చేశారు. శనివారం సీపీఎం పార్టీ పోరుబాటలో భాగంగా మండల వ్యాప్తంగా నెలకొన్న ప్రజాసమస్యల పరిష్కారంపై ధర్నా చేపడుతుండగా గౌరెల్లి నుంచి భద్రాచలం రహదారి భూనిర్వాసితుల రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతున్న ఆర్డివో శేఖర్‌రెడ్డిని అడుకుని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ, గౌరెల్లి నుంచి భద్రాచలం త్రిబుల్‌ఆర్‌ నిర్మాణంలో అనేక మంది పేదల సన్న, చిన్న కారు రైతుల భూములు కోల్పోతున్నారని వారికి ఇచ్చే పరిహారం రిజిస్ర్టేషన విలువ ప్రకారం ఇవ్వడం సరెంది కాదని అన్నారు. రైతులందరినీ కలిసి సమావేశం ఏర్పాటు చేసేబదులు అధికారులు రెండు, మూడు గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారిని మోసం చేస్తున్నారని ఆరోపించారు. భూములు కోల్పోతున్న భూనిర్వాసితులందరికీ భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు నిలువునా ముంచే ఈ చర్యలను వెంటనే మానుకోవాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు నిర్వాసితుల పక్షాన నిలవాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకటేశం, శ్రీశైలంరెడ్డి రాంచందర్‌, కిష్టయ్య, వెంకట్‌రెడ్డి చంద్రమౌళి, లింగం, సురేష్‌, ముత్యాలు, బిక్షపతి, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:28 AM