Share News

కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:07 AM

ఎన్నికల నిబంధనల మేరకు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువుల విడుదలకు గ్రీవెన్స్‌ కమిటీని సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే చెప్పారు.

కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే

పట్టుబడిన నగదు, వస్తువుల విడుదలకు గ్రీవెన్స్‌ కమిటీ

భువనగిరి అర్బన్‌, మార్చి 21: ఎన్నికల నిబంధనల మేరకు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువుల విడుదలకు గ్రీవెన్స్‌ కమిటీని సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే చెప్పారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ లోక్‌సభ సాధారణ ఎన్నికల దృష్ట్యా ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినందున పోలీస్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ , స్టాటిస్టికల్‌ సర్వైలైన్స్‌ టీంలు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న రూ.50వేలకు మించి నగదు, ఇతర వస్తువులను పరిశీలించి విడుదల చేసేందుకు జిల్లాస్థాయి గ్రీవెన్స్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధారాలు లేకుండా ఎక్కువ మొత్తంలో నగదు తరలించవద్దని, అలా పట్టుబడిన నగదును సీజ్‌చేసి డిపాజిట్‌ చేస్తామన్నారు. ఎన్నికలకు సంబంధం లేదని ఆధారాలు చూపితే తిరిగి ఇచ్చేస్తామని, అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, వివాహం ఇతర అవసరాలకు తరలించే వారు సరైన పత్రాలతో నగదు తీసుకెళ్ల వచ్చన్నారు. ఆధారాలు లేక సీజ్‌ అయిన నగదు విషయమై అప్పీలు చేసుకునేందుకు సరైన ఆధారాలతో దరఖాస్తు చేసుకునేందుకు గ్రీవెన్స్‌ కమిటీ కన్వీనర్‌ జే.రాజేశ్వర్‌రెడ్డి (సెల్‌ 9848156183)ని సంప్రదించాలన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:07 AM