Share News

21న భువనగిరికి సీఎం రేవంత్‌

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:02 AM

సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 21న భు వనగిరికి రానున్నారని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం భువనగిరిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్య ర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా లక్ష మందితో సీఎం రేవంత్‌రెడ్డి భువనగిరిలో రోడ్‌షో నిర్వహించనున్నట్లు తెలిపారు.

21న భువనగిరికి సీఎం రేవంత్‌

లక్ష మందితో రోడ్‌ షో

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

భువనగిరి టౌన్‌, ఏప్రిల్‌ 19: సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 21న భు వనగిరికి రానున్నారని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం భువనగిరిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్య ర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా లక్ష మందితో సీఎం రేవంత్‌రెడ్డి భువనగిరిలో రోడ్‌షో నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ చౌరస్తా నుంచి పాత బస్టాండ్‌ వరకు నిర్వహించే రోడ్‌షోలో సీఎం ప్రసంగిస్తారని తెలిపారు. పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. రోడ్‌షోను విజయంతం చేయాలని కోరారు. భువనగిరిలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమైందని, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భువనగిరి నియోజకవర్గంలో పార్లమెంట్‌ ఎన్నికల్లో రెట్టింపు మెజార్టీ సాధిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా రైతాంగాన్ని వేధిస్తున్న మూసీ నది ప్రక్షాళనకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేసి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేశారని, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఆగస్టు 15లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ పూర్తవుతుందన్నారు. ఆరు గ్యారంటీ పథకాలకు ఐదు పథకాలు ఈపాటికే ప్రారంభమయ్యాయన్నారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్మన్‌ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీపీ నూతి రమేష్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, సభ్యుడు తంగెల్లపల్లి రవికుమార్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్లు దొనకొండ వనిత, బర్రె జహంగీర్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు కూర వెంకటేష్‌, కౌన్సిలర్లు జిట్ట వేణుగోపాల్‌రెడ్డి, వెంకట్‌ నర్సింగ్‌ నాయక్‌, నాయకులు పొట్టోళ్ల శ్యాంగౌడ్‌, శెట్టి బాలయ్య యాదవ్‌, భువనగిరి వెంకట రమణ, డి రాములు, శ్రీలత గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:02 AM