Share News

సీఎం రేవంత్‌రెడ్డికి పాలనపై అనుభవం లేదు

ABN , Publish Date - May 23 , 2024 | 12:21 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలనపై అనుభవం లేదని, తెలంగాణ పాలనపై ఆయనకు పట్టు దొరకడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం నల్లగొండకు వచ్చిన ఆమె నల్లగొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సీఎం రేవంత్‌రెడ్డికి పాలనపై అనుభవం లేదు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

నల్లగొండ, మే 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలనపై అనుభవం లేదని, తెలంగాణ పాలనపై ఆయనకు పట్టు దొరకడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం నల్లగొండకు వచ్చిన ఆమె నల్లగొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణను ఎలా పాలించాలో తెలియని స్థితిలో రేవంత్‌ ఉన్నారన్నారు. అధికారంలోకి కొత్తగా వచ్చామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని, కా నీ దేశాన్ని, ఉమ్మడి ఏపీని అత్యధిక కాలం పాలించిన కాంగ్రె్‌సకు అధికారం కొత్త ఎలా అవుతుందన్నారు. చిన్న రాష్ట్రాన్ని పాలించలేక బోర్లా పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆధారాలు, రుజువులు లేకుండా బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ మంత్రులపై ఆరోపణలు చేయడం లేదని, సంచలనాలకు తమ పార్టీ పాకులాడదని, సంచలనాలకు ప్రాధాన్యమిచ్చేదే రేవంత్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్‌ డిజిట్‌ స్థానాలు గెలవబోతున్నామని, అందులో హైదరాబాద్‌ కూడా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం అ ప్పులపాలైందని, పూటకో మాట మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అటకెక్కించిందని, బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల అప్పులయ్యాయనే అంశంపై అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ఆమె నిలదీశారు. ఎన్నికలకు ముందు ధాన్యానికి రూ.500బోనస్‌ ఇస్తామని, ఇప్పుడు కేవలం సన్న ధాన్యానికేనని మాట మార్చారని, రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని ఇవ్వడం లేదని, విద్యార్థులకు రూ. 5లక్షల క్రెడిట్‌ కార్డులు ఒక్కరికైనా ఇవ్వలేదన్నారు. నిలదీశారు. యువత తరుపున కొట్లాడేందుకు ఎమ్మెల్సీగా ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు.

Updated Date - May 23 , 2024 | 12:22 AM