ఆలేరు ఏఎంసీ చైర్‌పర్సనగా చైతన్య
ABN , Publish Date - Sep 10 , 2024 | 12:36 AM
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సనగా తుర్కపల్లి మండలానికి చెందిన ఐనాల చైతన్యను నియమిస్తూ వ్యవసాయ శాఖ రాష్ట్ర సెక్రటరీ ఎం.రఘునందర్‌రావు నియామక ఉత్తర్వులను జారీ చేశారు.
ఆలేరు రూరల్/ రాజాపేట, సెప్టెంబరు 9: ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సనగా తుర్కపల్లి మండలానికి చెందిన ఐనాల చైతన్యను నియమిస్తూ వ్యవసాయ శాఖ రాష్ట్ర సెక్రటరీ ఎం.రఘునందర్‌రావు నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన ఓసీ మహిళకు రిజర్వ్ కావడంతో చైతన్యను నియమించారు. వైస్ చైర్మనగా పచ్చిమట్ల మధర్‌గౌడ్, పాలక వర్గ సభ్యులుగా తండ పాండురంగం, ఎగ్గిడి యాదగిరి, చిలుకు కిష్టయ్య, సిలివేరు బాలరాజు, మాడోతు విఠల్‌నాయక్, ఎండి నసీరోద్దీన, ధీరావత పట్టు నాయక్, జహంగీర్, శివరాత్రి దానయ్య, మోతె మైసయ్య, సముద్రాల నర్సయ్య, ఎల్లందుల మల్లేశం, ఆలేరు పీఏసీఎస్ చైర్మన మొగులగాని మల్లేశంతో పాటు గుండ్లగూడెం సర్పంచ కమిటీ సభ్యులుగా ఉంటారు. వీరి పదవి కాలం రెండు సంవత్సరాల పాటు ఉంటుంది. కాగా ఆలేరు వ్యవసాయమార్కెట్ కమిటీకి రాజాపేట మండలం నుంచి ఇద్దరు డైరెక్టర్లు నియామాకం నెమిలె గ్రామానికి చెందిన సిలివేరు బాలరాజు, పుట్టగూడెం గ్రామానికి చెందిన విట్టాల్‌నాయక్‌ను గ్రామస్థులు అభినందించారు.