Share News

ఎరువులు, విత్తనాల కొరత సృష్టిస్తే కేసులు

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:28 AM

ఎరువులు, విత్తనాల కొరత చూపితే సంబంధిత డీలర్లపై కేసులు నమోదు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి కే.అనురాధ హెచ్చరించారు.

ఎరువులు, విత్తనాల కొరత సృష్టిస్తే కేసులు

డీఏవో అనురాధ

భువనగిరి రూరల్‌, జూన్‌ 3: ఎరువులు, విత్తనాల కొరత చూపితే సంబంధిత డీలర్లపై కేసులు నమోదు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి కే.అనురాధ హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్‌ షాపును ఆమె ఆకస్మికంగా తనిఖీచేసి విత్తనా ల ప్యాకెట్లు, ఎరువుల బ్యాగులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మార్పీ ధరలకే ఎరువులు, విత్తనాలు విక్రయించాలన్నారు. లైసెన్స్‌లు కలిగి ఉన్న డీల ర్ల వద్దే రైతులు నాణ్యమైన విత్తనాలను కొనుగోలుచేసి రశీదులు పొందాలన్నారు. ప్రతీ రోజు ఎరువులు,విత్తనాలకు సంబంధించిన నిల్వల ధరలపట్టిక బోర్డును దుకాణం ఎదు ట ఏర్పాటుచేయాలన్నారు. తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి పావని పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:28 AM