ఏబీవీపీ కార్యకర్తలపై నూతన చట్టం కింద కేసు
ABN , Publish Date - Jul 01 , 2024 | 11:53 PM
నూతన నేర చట్టాల ప్రకారం నల్లగొండ వనటౌన పోలీ్‌సస్టేషన పరిధిలో సోమవారం తొలి కేసు నమోదైంది.
నల్లగొండ క్రైం, జూలై 1 : నూతన నేర చట్టాల ప్రకారం నల్లగొండ వనటౌన పోలీ్‌సస్టేషన పరిధిలో సోమవారం తొలి కేసు నమోదైంది. సోమవారం నుంచి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎ్‌సఎస్) అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం నల్లగొండ జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వనటౌన పోలీసులు ఏబీవీపీ నేతలను అదుపులోకి తీసుకుని నూతన చట్టం ప్రకారం 170 బీఎనఎ్‌సఎ్‌స(ముందస్తు అరెస్ట్) యాక్ట్ కింద కేసు నమోదుచేశారు. ఏబీవీపీకి చెందిన 19 మంది నాయకులపై ప్రివెంటీవ్ అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు వనటౌన ఎస్‌ఐ సందీ్‌పరెడ్డి తెలిపారు.