Share News

తుంగతుర్తిలో ఆధిక్యం చూపని బీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:51 PM

భువనగిరి ఎంపీ నియోజక వర్గం పరిధిలోని తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంటు ఎన్నిక ల్లో బీఆర్‌ఎ్‌సకు ఒక్క బూత (పోలింగ్‌ కేంద్రం)లో నైనా మెజా ర్టీ దక్కలేదు.

   తుంగతుర్తిలో ఆధిక్యం చూపని బీఆర్‌ఎస్‌

మోత్కూరు, జూన 7: భువనగిరి ఎంపీ నియోజక వర్గం పరిధిలోని తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంటు ఎన్నిక ల్లో బీఆర్‌ఎ్‌సకు ఒక్క బూత (పోలింగ్‌ కేంద్రం)లో నైనా మెజా ర్టీ దక్కలేదు. నియోజక వర్గంలో 326 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 316 కేంద్రా ల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి మెజా ర్టీ సాధించగా కేవలం 10కేంద్రాల్లో బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ మెజార్టీ సాధించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి క్యామ మల్లే్‌షకు ఒక్క కేంద్రంలోనూ మెజార్టీ రాలేదు. ముఖ్యంగా తుంగతుర్తి మండ ల కేంద్రలో ఏడు పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఆరు కేంద్రాల్లో బీజేపీ మెజార్టీ సాధించగా ఒక్క కేంద్రంలో మాత్రం కాంగ్రెస్‌ ఒక్క ఓటు మెజా ర్టీ సాధించింది. మొత్తంగా తుంగతుర్తి పట్టణంలో బీజేపీ 267 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించింది. తుం గతుర్తిలో కాంగ్రె్‌సకు 1517 ఓట్లు, బీజేపీకి 1784 ఓట్లు, బీఆర్‌ఎ్‌సకు 312 ఓట్లు వచ్చాయి. తుంగతుర్తి మండలం రామన్నగూడెంలో బీజేపీ 28 ఓట్ల మెజార్టీ, వెంపటిలో రెండు బూతలు ఉండగా ఒక్క దాంట్లో బీజేపీ, మరొక దాంట్లో కాంగ్రెస్‌ మెజార్టీ సాధించాయి. మొత్తంగా వెంపటిలో కాంగ్రెస్సే 19 ఓట్ల ఆధిక్యత సాధించింది. ఇవి మినహా తుంగతుర్తి నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్సే బీజేపీ, బీఆర్‌ఎస్‌ కన్నా అధిక ఓట్లు సాధించింది.

Updated Date - Jun 07 , 2024 | 11:51 PM