బీఆర్‌ఎ్‌సకు భవిష్యత లేదు: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:52 PM
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎ్‌సకు భవిష్యత లేదని, బీఆర్‌ఎ్‌సకు వచ్చే సీట్లు సున్నా అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో వారికి వచ్చే సీట్లు సున్నా
కరువు మొదలైంది బీఆర్‌ఎస్ పాలనలోనే
సూర్యాపేట టౌన, ఏప్రిల్ 3 : పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎ్‌సకు భవిష్యత లేదని, బీఆర్‌ఎ్‌సకు వచ్చే సీట్లు సున్నా అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశభవిష్యతకు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కీలకం కానున్నాయన్నారు. కేంద్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రశ్నించే గొంతుకను నొక్కేసేలా ఈడీ, సీబీఐలను వాడుకుంటుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడిస్తేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వేయకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగించాడని తెలిపారు. రాష్ట్రానికి బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదని ఆరోపించారు. ఎన్నికల తర్వాత బీఆర్‌ఎ్‌సకు మనుగడలేదన్నారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే అబద్ధపు ప్రచారాలు చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కరువు పేరుతో మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారని, అసలు కరువు ప్రారంభమైందే బీఆర్‌ఎస్ పాలనలో అని తమ ప్రభుత్వంలో అది కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీఏఏ, ఎనఆర్‌సీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఫోనట్యాపింగ్‌తో నాయకులు, సినిమా నటులు ఎంతోమంది ఇబ్బంది పడ్డారని ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో తాగు, కరెంట్ సరఫరా, సాగునీరుపై మాజీ మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రకటనలు అర్థరహితమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,149 ఽధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామని, ఏచిన్న అవినీతి లేకుండా కొనుగోలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ఏఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. గతంలో రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీరు నిండుగా ఉంటే ప్రస్తుతం తక్కువగా నీరు ఉందని, నీటిని పొదుపుగా వాడుకుంటున్నామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 14 వరకు స్థానాలు గెలుచుకుంటుందని, దేశంలోనే అత్యధిక మెజార్టీతో ఈ నెల 6వతేదీన తుక్కగూడలో జరిగే పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునాఖర్గే, ఏఐసీసీ సభ్యుడు రాహుల్‌గాంధీ హాజరవుతున్నారని తెలిపారు. దేశభవిష్యతను మార్చేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. సభకు నల్లగొండ పార్లమెంట్ పరిధి నుంచి సుమారు 50 వేల మంది హాజరవడం జరుగుతందని సభను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, చకిలం రాజేశ్వర్‌రావు, అంజద్‌అలీ, బైరు శైలేందర్‌గౌడ్, కక్కిరేణి శ్రీనివాస్, వీరన్ననాయక్, గండూరి రమేష్, చింతమల్ల రమేష్, నాయకులు పాల్గొన్నారు.