భూతగాదాలతో ఘర్షణ: కర్రలతో దాడి
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:01 AM
భూతగాదాల ఘర్ణణ నేపథ్యంలో కర్రలతో దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు భువనగిరి రూరల్ ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు.

భువనగిరి రూరల్, మార్చి 5: భూతగాదాల ఘర్ణణ నేపథ్యంలో కర్రలతో దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు భువనగిరి రూరల్ ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు. వివరాలు ఇలా... భువనగిరి మండలం తుక్కాపూర్‌కు చెందిన జిల్లా శ్రీశైలం సమీప బంధువులు జిల్లా సత్తయ్య వ్యవసాయ బావికి వెళ్లే దారి (తోవ)కి సంబంధించి వివాదం నెలకొంది. అయితే శ్రీశైలం అతని బావి వద్దకు వెళుతుండగా సత్తయ్య అతని కుమారుడు మహేష్ కర్రలతో శ్రీశైలం తలపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. బాధితుడు శ్రీశైలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తయ్య అతని కుమారుడు మహేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ తెలిపారు.