Share News

బీజేపీ, కాంగ్రెస్‌ రహస్య మిత్రులు: బీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:24 AM

బీజేపీ, కాంగ్రెస్‌ రహస్య మిత్రులని, మునిసిపల్‌ చైర్మన, వైస్‌చైర్మన ఎన్నిక ద్వారా స్పష్టమైందని బీఆర్‌ఎస్‌ నాయకులు డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, కొలుపుల అమరేందర్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన చింతల కిష్టయ్య అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌ రహస్య మిత్రులు: బీఆర్‌ఎస్‌
సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

భువనగిరి టౌన, ఫిబ్రవరి 28: బీజేపీ, కాంగ్రెస్‌ రహస్య మిత్రులని, మునిసిపల్‌ చైర్మన, వైస్‌చైర్మన ఎన్నిక ద్వారా స్పష్టమైందని బీఆర్‌ఎస్‌ నాయకులు డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, కొలుపుల అమరేందర్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన చింతల కిష్టయ్య అన్నారు. మంగళవారం జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి రహస్యంగా సహకరించినందుకు ప్రతిఫలంగా ఆ పార్టీ బీజేపీకి వైస్‌చైర్మన పదవిని ఏకగ్రీవంగా అప్పటించిందన్నారు. బీఆర్‌ఎ్‌సతోనే భువనగిరి పట్టణాభివృద్ధి జరిగిందన్నారు. సమావేశంలో నాయకులు ఏవీ.కిరణ్‌కుమార్‌, శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:24 AM