Share News

భక్తజన సంద్రం.. యాదగిరి క్షేత్రం

ABN , Publish Date - May 27 , 2024 | 12:41 AM

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో యాదగిరిదివ్య క్షేత్రం కోలాహలంగా మారింది. వేసవితో పాటు వారాంతపు సెల వు కలిసి రావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

భక్తజన సంద్రం.. యాదగిరి క్షేత్రం

నృసింహుడి దర్శనానికి 80వేల మంది భక్తుల రాక

ప్రత్యేక దర్శనానికి రెండున్నర గంటలు, ధర్మ దర్శనానికి 4గంటలు

భువనగిరి అర్బన్‌, మే 26: లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో యాదగిరిదివ్య క్షేత్రం కోలాహలంగా మారింది. వేసవితో పాటు వారాంతపు సెల వు కలిసి రావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. 80వేల మంది భక్తు లు క్షేత్ర దర్శనానికి రాగా వీఐపీ టికెట్‌(రూ.150) దర్శనానికి రెండున్నర గంటలు, ధర్మదర్శనానికి నాలుగు గంటల సమ యం పట్టటంతో ఉభయ క్యూలైన్లు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం వేళ బ్రేక్‌ దర్శనానికి (అసలు సమయం 4-5 గంటల మధ్య) ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన భక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చి 40 నిమిషాలకే కుదించారు. ప్రధానాలయం, ప్రసాద విక్రయశాలల్లో మెట్ల దారి భక్తులతో కిటకిటలాడగా ఆలయ ఉత్తర దిశలో అలాగే మెట్ల మార్గంలో ఏర్పాటు చేసిన షెడ్డు కింద భక్తులు అధిక సంఖ్యలో సేద తీరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా కొండపైకి, కిందకు తరలించేందుకు ఆర్టీసీ అధికారులు తగినన్ని బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో కొండకింద బస్టాండ్‌ వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు నీడ సౌక ర్యం లేని రోడ్డుపైనే బస్సుల కోసం నిరీక్షించారు. కొండపైన బస్టాండ్‌లో ఆలయ అధికారులు వాహనాల పార్కింగ్‌ ఏర్పా టు చేయడంతో బస్సు ఎక్కాలంటే తీవ్ర ఆటంకం కలిగింది. పోటీపడి బస్సుల కిటికీల నుంచి బస్సు ఎక్కేశారు. కాగా, ఉచిత దర్శన క్యూలైన్‌లో వేచి ఉన్న హైదరాబాద్‌కు దిల్‌సుఖ్‌నగర్‌ చెందిన భక్తురాలు పద్మ సొమ్మసిల్లి పడిపోయింది. మరో భక్తుడు కళ్లు తిరిగి పడిపోగా తలకు స్వల్ప గాయ మైంది. ప్రథమ చికిత్స తర్వాత వీరిని నేరుగా దర్శనానికి అనుమతించారు. స్వామివారిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌ అంధుల కళాశాలలో చదివే ఎనిమిది మంది ది వ్యాంగ విద్యార్థులు వచ్చారు. వారికి నేరుగా దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు అనుమతించడంతో సురక్ష సిబ్బంది కల్యాణి వారి వెంట వెళ్లి దర్శనం చేయించారు.

శాస్త్రోక్తంగా నిత్య పూజలు

సుప్రభాత సేవతో స్వామి, అమ్మవారిని మేల్కొపిన అర్చకస్వాములు స్వయంభువులకు నిత్యపూజలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభువులకు అభిషేకం, అర్చనలు, ప్రాకార మండపంలో హోమం, నిత్య కల్యాణోత్సవ పర్వాలు వైభవంగా చేపట్టారు. అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనృసింహులకు నిత్య పూజలు ఘనంగా చేపట్టారు. శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారికి నిత్య పూజలు, రుద్రహవన పూజలు, శైవాగమరీతిలో జరిపారు. రాత్రి మహానివేదన, శయనోత్సవాలతో ఆలయ ద్వారబంధనం చేశారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు : ఈవో ఏ.భాస్కర్‌రావు

రాబోయే రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు ఆలయ ఈవో ఏ.భాస్కర్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దర్శనాలు, ప్రసాదాలు, ఇతర సదుపాయాలు సాధ్యమైనంత వరకు కల్పించేందుకు భక్తుల సహకారం అందివ్వాలని కోరారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ రవాణ సదుపాయాలతో ఈ నె ల 24న 60వేలు, 25న 75వేలు, 26న 81వేల మందికి భక్తు లు వచ్చినట్లు వివరించారు. ఈ నెల 24న రూ.48.44లక్ష లు, 25న రూ. 62.55లక్షలు, 26న రూ.1.02కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం ముందస్తు అంచనాలతో కొండపైన స్థలాభావం చేత కొండకిందనే వాహనాల పార్కింగ్‌ చేయించగా, గడిచిన మూడు రోజుల్లో సుమారు 25నుంచి 30వేల మంది వరకు మూడు రోజుల్లో సుమారు 86వేల మందిని ఉచిత బస్సులు ద్వారా చేరవేశామన్నారు. కొండపైన క్యూలైన్లల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల ఏర్పాట్లు, మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, రద్దీకి అనుగుణంగా ఎయిర్‌ చిల్లర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు స్పృహ కోల్పోయినట్లు సమాచారం అందగానే బ్యాటరీ వాహనంలో తరలించి ప్రథమ చికిత్స అందించనట్లు తెలిపారు. ప్రత్యేక, బ్రేక్‌ దర్శనం టికెట్లు విక్రయం తగ్గించి ధర్మదర్శనం భక్తులకు ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. ముందస్తు అంచనాలతో భక్తులకు సరిపడా లడ్డు, పులిహోర, అభిషేకం లడ్డూలను ఎప్పటికప్పుడు తయారుచేసి అందించినట్లు చెప్పారు.

యాదగిరీశుడిని దర్శించుకున్న ఆధార్‌ సిన్హా

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వావిని ఆదివారం పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఆధార్‌ సిన్హా దర్శించుకున్నారు. సతీసమేతంగా నృసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆయన వెంట జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్‌ సదానందం, డీడీ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌, ఫిషరీస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజారాం, డాక్టర్‌ శివరామకృష్ణ, శ్రీనివాస్‌, విజయడైరీ మేనేజర్‌ మహేష్‌ ఉన్నారు.

యాదగిరీశుడి నిత్య ఆదాయం రూ.1.02కోట్లు

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఖజనాకు ఆదివారం రూ.1,02,68,099ఆదాయం సమకూరింది. ఒక్క రోజులో రూ.కోటి ఆదాయం దాటడం ఈ సంవత్సరంలో మొదటిసారి అని ఆలయ అధికారులు తెలిపారు.

8 ప్రధాన బుకింగ్‌ రూ. 21,58,050,

8 సుప్రభాత సేవ రూ.22,700,

8 బ్రేక్‌ దర్శనానికి రూ. 6,81,900,

8 వ్రతాలకు రూ.2,26,400,

8 వాహన పూజలకు రూ.11,300,

8 వీఐపీ దర్శనానికి రూ. 18,75,000,

8 ప్రచార శాఖ ద్వారా రూ.35,550,

8 పాతగుట్ట ఆలయం ద్వారా రూ.1,21,720,

8 కొండపైకి వాహనాల ప్రవేశం రూ.9,00,000,

8 యాదరుషి నిలయం ద్వారా రూ.3,50,860,

8 సువర్ణ పుష్పార్చన రూ.2,01,940,

8 శివాలయం రూ.15,000,

8 పుష్కరిణి ద్వారా రూ. 2,100,

8 ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 33,32,050

8 కల్యాణ కట్ట ద్వారా రూ.2,12,500,

8 శాశ్వత పూజలు రూ.30,000,

8 ఆలయ పునరుద్ధరణ నిధి రూ.12,000,

8 లాకర్స్‌ ద్వారా రూ.240,

8 అన్నదానం రూ.78,789 ఆదాయం సమకూరింది.

మొత్తం ఆదాయం రూ.1,02,68,099

Updated Date - May 27 , 2024 | 12:41 AM