Share News

వీగిపోయిన అవిశ్వాసం

ABN , Publish Date - Apr 02 , 2024 | 12:39 AM

ఎం పీపీ గుత్తా ఉమాదేవిపై బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీల అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. సోమవారం మండ ల పరిషత్‌ కార్యాలయంలో ఆర్డీవో శేఖర్‌రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పూర్తిస్థాయిలో కోరం లేకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీవో ప్రకటించారు.

వీగిపోయిన అవిశ్వాసం

పంతం నెగ్గించుకున్న ఎంపీపీ

బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీల ఆందోళన

సంస్థాన్‌ నారాయణపురం, ఏప్రిల్‌ 1 : ఎం పీపీ గుత్తా ఉమాదేవిపై బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీల అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. సోమవారం మండ ల పరిషత్‌ కార్యాలయంలో ఆర్డీవో శేఖర్‌రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పూర్తిస్థాయిలో కోరం లేకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీవో ప్రకటించారు. నారాయణపురం మండలంలో మొత్తం 13మంది ఎంపీటీలు ఉండగా గుజ్జ గ్రామానికి చెం దిన సీపీఎం ఎం పీటీసీ ఇటీవల మృతి చెందాడు. దీంతో 12 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఇందులో బీఆర్‌ఎ్‌సకు చెందిన వారు తొమ్మిది, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. అయితే మండల పరిషత్‌ కార్యాలయంలో ఆర్డీవో శేఖర్‌రెడ్డి అధ్యక్షతన అవిశ్వాసనోటీసుపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్‌ఎ్‌సకు ఎనిమిది ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారు. బీఆర్‌ఎ్‌సతో పాటు కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంలకు చెందిన ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. అవిశ్వాసం నెగ్గాలంటే 9 మంది ఎంపీటీసీలు ఉండాలని,బీఆర్‌ఎ్‌సకి చెందిన ఎనిమిది మంది మాత్రమే హాజరు కావడంతో పూర్తిస్థాయిలో కోరం లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ఆర్డీవో శేఖర్‌రెడ్డి ప్రకటించారు. దీంతో అధికా ర కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీపీపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు పెట్టినఅవిశ్వాసం వీగిపోవడం తో అధికార పార్టీకి చెందిన ఎంపీపీ ఉమాదేవి తన పంతం నెగ్గించుకున్నట్లయింది. అవిశ్వాసం వీగిపోవడంతో ఎంపీపీగా యఽథావిధిగా కొనసాగనున్నారు.

బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీల ఆందోళన

చట్టాన్ని తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధం గా ఆర్డీవో శేఖర్‌రెడ్డి అధికార పార్టీకి కొమ్ముకాశారని ఆరోపిస్తూ బీఆర్‌ఎ్‌సకు చెందిన ఎంపీటీసీలు మండ ల పరిషత్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ని బంధన ప్రకారం తమకు పూర్తి మెజార్టీ ఉన్నా కావాలని అధికార పార్టీకి చెందిన ఎంపీపీకి అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. ఆర్డీవో వాహనాన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుతగిలారు. చనిపోయిన ఎంపీటీసీని కూడా ఎలా పరిగనలోకి తీసుకుంటారంటూ నిలదీశారు.ఆందోళనలతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు బీఆర్‌ఎస్‌ నాయకులను తప్పించి ఆర్డీవో వాహనా న్ని పంపించి వేశారు. అనంతరం ఇదే విషయమై ఎం పీడీవో ప్రమోద్‌కుమార్‌తో బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు కొంతసేపు వాగ్వాదం చేశారు. అధికారులు, పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.

బీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీటీసీ విజయ బహిష్కరణ

చిల్లాపురం గ్రామ బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ కరంటోతు విజయదశరథను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ ఉమాదేవిపై అవిశ్వాస సమయంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 12:39 AM