Share News

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

ABN , Publish Date - May 19 , 2024 | 12:23 AM

వానాకాలంలో సీజనల్‌ వ్యాధుల బారిన పడే రో గులకు మెరుగైన వైద్య సేవలనందించాలని వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌ ఆదేశించారు.

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

వైద్యా విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌

చౌటుప్పల్‌ టౌన్‌, మే 18: వానాకాలంలో సీజనల్‌ వ్యాధుల బారిన పడే రో గులకు మెరుగైన వైద్య సేవలనందించాలని వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌ ఆదేశించారు. చౌటుప్పల్‌ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో శనివారం జిల్లాలోని వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న చౌ టుప్పల్‌, భువనగిరి, రామన్నపేట, ఆలేరు సీహెచ్‌సీ సూపరింటెండెంట్లు కె.అలివేలు, స్వప్న, వీరన్న, రాజగోపాల్‌తో కమిషనర్‌ సమీక్ష నిర్వహించారు. సీహెచ్‌సీల పనితీరు, రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై కమిషనర్‌ సమీక్షించారు. వానాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రోగులకు సోకే సీజనల్‌ వ్యాధులపై నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. చౌటుప్పల్‌ సీహెచ్‌సీలోని వార్డులలో తిరిగి వైద్యసేవలపట్ల రోగులతో కమిషన ర్‌ మాట్లాడి సంతృప్తి వ్యక్తంచేశారు. సూపరింటెండెంట్‌ అలివేలును కమిషనర్‌ అభినందించారు. సమీక్షలో డీసీహెచ్‌ఎ్‌స చిన్నా నాయక్‌ పాల్గొన్నారు. అదేవిధంగా 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను కమిషనర్‌ పరిశీలించా రు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.

Updated Date - May 19 , 2024 | 12:23 AM