Share News

బీసీ సమగ్ర కులగణన చేపట్టాలి

ABN , Publish Date - Sep 03 , 2024 | 12:27 AM

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ సమగ్ర కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చలమల్ల నర్సింహ అన్నారు.

బీసీ సమగ్ర కులగణన చేపట్టాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న బీసీ సంక్షేమ సంఘ నాయకులు

సూర్యాపేటఅర్బన, సెప్టెంబరు 2: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ సమగ్ర కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చలమల్ల నర్సింహ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ఏవో సుదర్శనరెడ్డికి వినతిపత్రం అందజేసి మా ట్లాడారు. ముఖ్యమంత్రి రేవంతరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ కులగణన చేసి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించి ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆరు నెలల్లో కులగణన చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టడం జరిగిందన్నరు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆరోపించారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు తన్నీరు రాంప్రభు, జిల్లా గౌరవ అధ్యక్షుడు బైరు వెంకన్నగౌడ్‌, అప్పం శ్రీనివాసరావు, భూపతి నారాయణగౌడ్‌, గొట్టిపర్తి శ్రీకాంత, సంపతనాయుడు, జంపాల వెంకటేశ్వర్లు, సాలయ్య, వెంకన్నయాదవ్‌, పృద్వి, కోడి లింగయ్య, అంజ య్య, సైదులు, సుదర్శన, బ్రహ్మం, నాగేందర్‌ పాల్గొన్నారు.

గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలి

సూర్యాపేట అర్బన: ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న అర్హులైన పేదలకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్‌)మా్‌సలైన జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ఏవో సుదర్శనరెడ్డికి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని కుడకుడలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్‌ 126, నేరేడుచర్ల మునిపల్‌ పరిధిలోని సర్వే నెంబర్‌ 243, 244లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పే దలకు శాశ్వత పట్టాలు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంలో కలెక్టర్లకు, అధికారులకు అనేకసార్లు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోకుండా గుడిసెలు తొలగించే ప్రయత్నం చేయడంతో పాటు అక్రమకేసులు పెట్టారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కారింగుల వెంకన్న, పేర్ల నాగయ్య, గొడ్డలి నర్సయ్య, ఎర్ర అఖిల్‌కుమార్‌, పిడమర్తి లింగయ్య, ఎస్‌కె. సయ్యద్‌, వాజిద్‌, గులాం, అంజయ్య, జ్ఞానసుందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 12:27 AM