Share News

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:57 AM

తెలంగాణ సంస్కతీ సంప్రదాయాలకు బతుకమ్మ పం డుగ ప్రతీక అని జిల్లా పరిషత సీఈవో ఎన.శోభారాణి అన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

భువనగిరి రూరల్‌, అక్టోబరు 9: తెలంగాణ సంస్కతీ సంప్రదాయాలకు బతుకమ్మ పం డుగ ప్రతీక అని జిల్లా పరిషత సీఈవో ఎన.శోభారాణి అన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బుధవారం స్థానిక జిల్లా పరిషత కార్యాలయ ఆవరణలో జిల్లా పరిధిలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. బతుకమ్మతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అనంతరం బతుకమ్మలను భువనగిరి శివారులోని పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్‌ అధికారిని సుభాషిణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భూదానపోచంపల్లి : స్థానిక మార్కండేశ్వరస్వామి దేవాలయం ఎదుట ప్రధాన రహదారిలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌పీలు, కాలనీల్లోని మహిళలు బతుకమ్మలతో ఆట పాటలతో అలరించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌, వైస్‌చైర్మన బాత్క లింగస్వామియాదవ్‌, కమీషనర్‌ వెంకటేష్‌ నాయక్‌, కౌన్సిలర్లు గుండు మధు, సామల మల్లారెడ్డి, బోగ భానుమతి విష్ణు, కుడికాల అఖిల బలరాం, దేవరాయ కుమార్‌, ఆర్‌పీలు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 12:57 AM