Share News

బునాదిగాని కాల్వ పనులు ప్రారంభించాలి

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:57 PM

అ సంపూర్తిగా ఉన్న బునాదిగాని (ధర్మా రం) కాల్వ నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి, పను లు ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ డిమాండ్‌చేశారు.

బునాదిగాని కాల్వ పనులు ప్రారంభించాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

మోత్కూరు, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు, సెప్టెంబరు 10: అ సంపూర్తిగా ఉన్న బునాదిగాని (ధర్మా రం) కాల్వ నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి, పను లు ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ డిమాండ్‌చేశారు. బునాదికాల్వ నిర్మాణం పూర్తి చేయాలన్న డిమాండ్‌తో సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం అడ్డగూడూరు మండల కేంద్రం నుంచి ప్రారంభమైన బైక్‌ ర్యాలీ మోత్కూరు చేరుకు న్న సందర్భంగా అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆయన ప్రజల నుద్దేశించి మాట్లాడారు. కాల్వ నిర్మాణం ప్రారంభించి రెండు దశాబ్దాలవుతున్నా నిర్మాణం పూర్తి కాలేదన్నా రు. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన గడువులోగా పూర్తి చేయకుంటే ఆయన క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, బొల్లు యాదగిరి, గుండు వెంకటనర్సు, రాచకొండ రాములమ్మ, పైళ్ల యాదిరెడ్డి, వలిగొండ, తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు

పాలకుల అసమర్థత కారణంగా ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని జహంగీర్‌ అన్నారు. బునాదిగాని కాల్వ పనులు పూర్తి చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన బైక్‌ ర్యాలీ మంగళవారం ఆత్మకూరు(ఎం) మండలానికి చేరుకొంది. మండలంలోని పుల్లాయిగూడెం, కూరెళ్ల, పల్లెర్ల, సిద్దాపురం, ఆత్మకూరు, తిమ్మాపురం, సర్వేపల్లి గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న బునాదిగాని కాల్వను బృందం సభ్యులు పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో కె.చంద్రారెడ్డి, జయరాములు, స్వామి, వేముల బిక్షం, వెంకటనర్సయ్య, పైళ్ల యాదిరెడ్డి, రాచమల్ల సత్తయ్య, రచ్చగోవర్థన్‌, తుమ్మల సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

సైకిల్‌ యాత్ర ప్రారంభం

అడ్డగూడూరు మండలకేంద్రంలో బునాది కాల్వ పనులను ప్రారంభించాలని సీపీఎం ఆధ్వర్యంలో తలపెట్టిన సైకిల్‌ యాత్రను జహంగీర్‌ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పాండు, నర్సింహ, అనిల్‌కుమార్‌, రాజు, యాదగిరి, వెంకటనర్సు, రాజు, శ్రీనివాసరావు, మల్లయ్య, స్వామి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:57 PM