Share News

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

ABN , Publish Date - Jun 18 , 2024 | 12:17 AM

త్యాగానికి ప్రతీక బక్రీద్‌ పండుగ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సోమవారం బక్రీద్‌ పండుగ సందర్భంగా మసీదుల్లో ముస్లింల ప్రార్థన అనంతరం ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

 త్యాగానికి ప్రతీక బక్రీద్‌
ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్న జగదీష్‌రెడ్డి

మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

జిల్లా అంతటా ప్రత్యేక ప్రార్థనలు

సూర్యాపేట టౌన, జూన 17 : త్యాగానికి ప్రతీక బక్రీద్‌ పండుగ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సోమవారం బక్రీద్‌ పండుగ సందర్భంగా మసీదుల్లో ముస్లింల ప్రార్థన అనంతరం ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఉన్నదానిలోనే లేనివారికి కొంతైనా పంచాలని బక్రీద్‌ పండుగ సందేశం ఇస్తుందన్నారు. సహోదర భావాన్ని అంతా పంచుకోవాలన్నారు. కుల, మతాల వైషమ్యాలకు అతీతంగా అంతా కలిసి పండుగలు జరుపుకోవడం దేశ ఔన్నత్యానికి నిదర్శనమన్నారు. మానవ జాతికి ధాన గుణమే ఉత్తమ గుణమని , దానికంటే గొప్ప త్యాగనిరతి లేదన్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, కొప్పుల వేణారెడ్డి ముస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట మైనార్టీ నాయకులు సయ్యద్‌సలీం, జలీల్‌, జానీబాయ్‌, రఫీ, చాందుపాషా, మతపెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2024 | 12:17 AM