స్వామియే శరణం అయ్యప్ప
ABN , Publish Date - Dec 02 , 2024 | 12:27 AM
అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి భువనగిరిలోని మార్కెట్ యార్డులో అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
భక్తి శ్రద్ధలతో పడి పూజ మహోత్సవం
భువనగిరి టౌన, డిసెంబరు 01 (ఆంధ్రజ్యోతి)ః అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి భువనగిరిలోని మార్కెట్ యార్డులో అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కేరళ సాంప్రదాయరీతిలో నిర్వహించిన పడి పూజ మహోత్సవం భక్తిభావాన్ని చాటింది. దీక్షా పరుల శరణు గోషతో పరిసరాలు పిక్కటిల్లాయి. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక అలవాటుతో జీవన శైలి మారుతుందని, అందరూ భక్తిమార్గంలో పయనించాలని అన్నారు. కార్యక్రమం లో మునిసిపల్ చైర్మన పోతంశెట్టి వెంకటేశ్వర్లు, వైస్‌చైర్మన మాయ దశరథ, కౌన్సిలర్లు చెన్న స్వాతి మహేష్, తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక శ్రీ పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజను వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన రాజు పాల్గొన్నారు.