Share News

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:06 AM

పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ దాసరి హరిచందన అధికారులను అదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ చందనా దీప్తితో కలిసి ఏఆర్వోలు, పోలీ స్‌ అధికారుతో పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి

కలెక్టర్‌ దాసరి హరిచందన

నల్లగొండ రూరల్‌, మార్చి 13: పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ దాసరి హరిచందన అధికారులను అదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ చందనా దీప్తితో కలిసి ఏఆర్వోలు, పోలీ స్‌ అధికారుతో పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్లు, ర్యాంపులు, విద్యుత్‌, ఫర్నిచర్‌ కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. ఆక్సీలరీ పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు పై రెండో రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కడైనా పోలింగ్‌ కేంద్రం లొకేషన్‌ మార్చాల్సి వస్తే రెండు రోజుల్లో తెలియజేయాలని అదేశించారు. మరోసారి బీఎల్‌వో నియామకాలు సరిచూసుకోవాలని, ఎవరైనా బదిలీ అయి ఉంటే ఆ మార్పులు అన్నింటినీ సరిచేసి నివేదిక సమర్పించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తింపుపై పోలీసు అధికారులతో చర్చించి రూపొందించాలన్నారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్‌ కేంద్రాలను గుర్తించాలని, ఎన్నికలకు నియమించిన అన్ని బృందాలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, పోలీసు సిబ్బందితో కలిపి శిక్షణ నిర్వహించాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గం వారీగా ఎన్నికల ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎఫ్‌ఎ్‌సటీ, ఎస్‌ఎ్‌సటీ, వీఎస్‌టీ, వీవీటీ, ఎంసీసీ బృందాలను నియమించాలని, సెక్టోరియల్‌అధికారులను ముందే గుర్తించి సిద్ధం చేసుకోవాలన్నారు. సెక్టార్ల అధికారులు వారికి కేటాయించిన సెక్టర్లను మూడుసార్లు సందర్శించాల్సి ఉంటుందని, పోలీసు అధికారులతో కలిసి సందర్శించాలని తెలిపారు. ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి, సువిధ అనుమతులు, నామినేషన్లు ఇతర సమయాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాటించిన అన్ని నిబంధనలను పాటిస్తూ కొత్తగా ఎన్నికల సంఘం జారీ చేసే సూచనలను సైతం దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ జే.శ్రీనివాస్‌, ఏఎస్పీ రాములునాయక్‌, స్పెషల్‌ కలెక్టర్‌ నటరాజ్‌, ఏఆర్వోలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 12:06 AM