గ్రూప్-1 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:47 PM
గ్రూప్-1 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూ ర్తి చేశామని కలెక్టర్ హనుమంతు కే.జెండగే తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించి న శిక్షణలో ఆయన మా ట్లాడారు.

కలెక్టర్ హనుమంతు కే.జెండగే
భువనగిరి అర్బన్, జూన్ 7: గ్రూప్-1 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూ ర్తి చేశామని కలెక్టర్ హనుమంతు కే.జెండగే తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించి న శిక్షణలో ఆయన మా ట్లాడారు. 50మంది అభ్యర్థులకు ఒక ఐడెంటిఫికేషన్ అధికారిని నియమించామన్నారు. పరీక్ష నిర్వహణలో ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘి స్తే జిల్లా నోడల్ అధికారి, పోలీస్ నోడల్ అధికారి, రీజినల్ కో-ఆర్డినేటర్‌కు సమాచారం ఇచ్చేందుకు పరిశీలకులను నియమించామన్నారు. పరీక్ష పేపర్లను స్ట్రాంగ్ రూంకు తరలించేందుకు రూట్ ఏర్పా టు చేశామన్నారు. పరీక్ష రోజున కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. డీసీపీ రాజే్‌షచంద్ర మాట్లాడుతూ, పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ పక్కాగా ఉంటుందన్నారు. కేంద్రా ల వద్ద పార్కింగ్ స్థలాలను గుర్తించిన ప్రదేశంలో మాత్రమే అభ్యర్థులు వాహనాలు నిలపాలన్నా రు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల ఎలాంటి మైక్ శబ్దాలు లేకుండా చీఫ్ సూపరింటెండెంట్లు ముందు రోజే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈవో కే.నారాయణరెడ్డి, రీజనల్ కో-ఆర్డినేటర్ బాలాజీ, మాస్టర్ ట్రైనర్లు నర్సిరెడ్డి, హరినాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు విత్తనాలు, ఎరువులు అందించాలి : కలెక్టర్
వానాకాలం సాగుకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించాలని కలెక్టర్ హనుమంతు కే.జెండగే అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2,85,000ఎకరాల్లో వరి, 1,35,000ఎకరాల్లో పత్తి, 85,000ఎకరాల్లో కంది, 22,350ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతాయ ని వ్యవసాయశాఖ అంచనా వేసిందన్నారు. పక్కా కార్యచరణతో రైతులకు విత్తనాలు అందించాలన్నారు. జూలై, ఆగస్టు మాసాల్లో ఎరువుల అవసరం ఎక్కువ ఉంటుందన్నారు. ఎరువులను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 78,884 పత్తి విత్తనాల ప్యాకెట్లు విక్రయించగా, 73,744 ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 3,449మెట్రిక్ టన్నుల యూరియా, 710మెట్రిక్ టన్నుల డీఏపీ, 2,665మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 251మెట్రిక్ టన్నుల పొటాష్, 120మెట్రిక్ టన్నుల సూపర్‌ఫాస్పెట్ అందుబాటులో ఉందన్నారు. రైతులు లైసెన్స్ డీలర్ల వద్ద విత్తనాలు, ఎరువులు కొనుగోలుచేసి అందుకు సంబంధించిన బిల్లులు తప్పని సరిగా పొందాలన్నారు. సమీక్షలో వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, మార్క్‌ఫెడ్ అధికారి జ్యోతి, వ్యవసాయశాఖ ఏడీఏలు దేవ్‌సింగ్, వెంకటేశ్వరరావు, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.