Share News

రంజానకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:01 AM

రంజాన మాసం నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ హనుమంతు కే జెండగే అధికారులను ఆదేశించారు.

రంజానకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే, డీసీపీ రాజే్‌షచంద్ర

భువనగిరి అర్బన, మార్చి 11 : రంజాన మాసం నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ హనుమంతు కే జెండగే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన శాంతి సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవిత్ర మాసం సందర్భంగా శాఖలు సమన్వయంతో కేటాయించిన విధులు నిర్వహించాలన్నారు. మసీదుల వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయాలన్నారు. డీసీపీ రాజే్‌షచంద్ర మాట్లాడుతూ ఇఫ్తార్‌ విందుల సమాచారమిస్తే సరైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఆర్డీవోలు అమరేందర్‌, శేఖర్‌రెడ్డి, డీఆర్‌డీవో ఎంఏ కృష్ణన, పంచాయతీరాజ్‌ ఈఈ వెంకటేశ్వర్లు, మైనార్టీ శాఖ ఇనచార్జి అధికారి పీ యాదయ్య, డీపీవో సునంద, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ జయక్రిష్ణ, డీఎస్‌వో శ్రీనివా్‌సరెడ్డి, మేనేజర్‌ గోపీకృష్ణ, శాంతి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

లోక్‌సభ ఎన్నికలకు పూర్తి సహకారం అందించాలి : కలెక్టర్‌

భువనగిరి లోక్‌సభ ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయపార్టీలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్‌ హనుమంతు కే జెండగే సూచించారు. కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు నివాసానికి రెండు కిలోమీటర్లకు పైగా దూరమున్న కేంద్రాల మార్పులకు నాలుగు కొత్త అనుబంధ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. భువనగిరి, ఆలేరు, మునుగోడు (చౌటుప్పల్‌, నారాయణపురం), నకిరేకల్‌ (రామన్నపేట), తుంగతుర్తి (మోత్కూర్‌, అడ్డగూడూరు) నియోజకవర్గాలకు సంబంధించి 812 కేంద్రాల్లో మూడు కేంద్రాల లోకేషన మార్పు ఉంటుందన్నారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:01 AM