Share News

దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:00 AM

‘ప్రజావాణి’ కార్యక్రమంలో ప్రజలు అందించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఎస్‌ వెంకటరావు అన్నారు.

దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ వెంకటరావు

సూర్యాపేట(కలెక్టరేట్‌), జూన 10 : ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ప్రజలు అందించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఎస్‌ వెంకటరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించి, మాట్లాడారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్నిశాఖల అధికారులు విధిగా హాజరుకావాలన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసినందున అభివృద్ధి పనులపై దృష్టి సారించాలన్నారు. సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ మూడో విడత కాలనీలో, కేసారం వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను అప్పగించేందుకు 10 బృందాలను ఏర్పాటు చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని సూర్యాపేట ఆర్డీవోకు సూచించారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నందున పనులు పూర్తయిన పాఠశాలలను ఎమ్మెల్యేలతో ప్రారంభించి, విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఎ్‌ఫవో సతీ్‌షకుమార్‌, జడ్పీ సీఈవో అప్పారావు, డీఆర్‌డీవో మధుసూదనరాజు, ఆర్డీవో వేణుమాధవ్‌, డీఈవో అశోక్‌, డీపీవో సురేష్‌, డీఏవో శ్రీధర్‌రెడ్డి, డీఎంహెచవో డాక్టర్‌ కోటా డీటీడబ్ల్యూవో వెంకటరమణ, ఏవో సుదర్శనరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 12:00 AM