బీబీనగర్-గుంటూరు రైల్వే డబ్లింగ్‌లో మరో ముందడుగు
ABN , Publish Date - Jun 26 , 2024 | 12:32 AM
ఏళ్లుగా ఊరిస్తూ, ఆశలు రేకెత్తిస్తున్న బీబీనగర్-గుంటూరు రైల్వే డబ్లింగ్ పనుల్లో మరో ముందడు గు పడింది. బీబీనగర్-గుంటూరు రైల్వే డబ్లింగ్ విషయాన్ని పలు పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు లేవనెత్తడం, అది వాయిదా పడటం సర్వసాధారణం గా మారింది.
జిల్లాలో భూ సేకరణకు గెజిట్ నోటిఫికేషన్
మొత్తం 26హెక్టార్లకు పైగా భూసేకరణ
రాత పూర్వకంగా అభ్యంతరాల స్వీకరణ
న్యాయమైన పరిహారం అందించేందుకు రైల్వేశాఖ నిర్ణయం
రైల్వే ప్రయాణికులకు మెరుగుపడనున్న సేవలు
వ్యాపార రంగాల అభివృద్ధికి సైతం ప్రయోజనం
నల్లగొండ: ఏళ్లుగా ఊరిస్తూ, ఆశలు రేకెత్తిస్తున్న బీబీనగర్-గుంటూరు రైల్వే డబ్లింగ్ పనుల్లో మరో ముందడు గు పడింది. బీబీనగర్-గుంటూరు రైల్వే డబ్లింగ్ విషయాన్ని పలు పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు లేవనెత్తడం, అది వాయిదా పడటం సర్వసాధారణం గా మారింది. బీబీనగర్-గుంటూరు జిల్లాల మధ్య ప్రయాణికుల సంఖ్య పెరిగినా, డబుల్ లైన్ లేకపోవడంతో రైళ్ల రాకపోకలు అంతంతా మాత్రంగానే ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, వైజాగ్, చెన్నై, ఒడిషా, కేరళ, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలకు రైళ్ల రాకపోకలు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రంలోని షిర్డీ, కేరళ వంటి ప్రాంతాలకు వారానికి ఒక రైలు మాత్రమే నడిపిన సందర్భాలు ఉన్నాయి. బీబీనగర్-గుంటూరు మధ్య సింగిల్ రైల్వే లైన్ ఉండటంతో స్పీడ్‌గా వెళ్లే రైళ్ల కోసం కొన్ని రైళ్లను చిన్న స్టేషన్లలో చాలా సమయం నిలిపి వేయడం వంటివి జరుగుతున్నాయి. క్రాసింగ్ కోసం ప్యాసింజర్ రైళ్లులు చాలా సేపు వేచి ఉండాల్సి వస్తోంది. ఎట్టకేలకు డబ్లింగ్ పనుల్లో ముందడుగు పడటంతో ప్రయాణికుల ఇబ్బందులు తప్పనున్నాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన సికింద్రాబాద్, నడికూ డి, గుంటూరు రైలు మార్గంలో డబుల్‌లైన్ వస్తే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందనున్నాయి. బీబీనగర్-గుంటూరు మధ్య 239కి.మీ డబ్లిం గ్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,853కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. అందుకు సంబంధిం చి రైల్వే బోర్డు దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. దీంతో నల్లగొండ జిల్లాలో భూ సేకరణకు గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన ప్రభుత్వం, మొత్తం 26హెక్టార్లకు పైగా భూమి సేకరించనుంది. ప్రధానంగా నల్లగొండ జిల్లాలో చిట్యాల మండలంలోని వట్టిమర్తితో పాటు పలు గ్రామాలు, నార్కట్‌పల్లి మండలంలోని చెరువుగట్టు, నల్లగొండ మండలంలోని అన్నెపర్తి, చర్లపల్లి, మర్రిగూడ, పానగల్లు, గొల్లగూ డ, తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి, జంగారెడ్డిగూ డెం, రాజుపేట, తిప్పర్తి మండల కేంద్రాల పరిధిలో సిం గిల్ ట్రాక్ వెంట భూసేకరణ చేస్తారు. డబ్లింగ్ కోసం ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు డిమాండ్ చేయగా, ఎట్టకేలకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో రైల్వేశాఖ పనుల కొనసాగింపునకు నిర్ణయించింది. భూసేకర ణ జరిగిన వెంటనే రైల్వేశాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. దీంతో సికింద్రాబాద్ నుంచి చెన్నై, తిరుపతి మధ్య దూరభారం తగ్గనుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, చెన్నైకి విజయవా డ మార్గం గుండా పోలిస్తే నడికుడి, గుం టూరు మార్గంలో సుమారు 46కి.మీల దూరం తగ్గుతుంది. సికింద్రాబాద్, విజయవాడ మధ్య ప్రస్తుతం రెండు రైల్వే మార్గాలున్నాయి. అందులో ఖాజీపేట, ఖమ్మం మార్గంలో ప్రయాణిస్తే సికింద్రాబాద్, విజయవాడ మధ్య దూరం 350కి.మీలు. బీబీనగర్, నడికుడి, గుంటూరు మార్గంలో విజయవాడకు దూరం 336కి.మీలు. డంబ్లీంగ్ చేపడితే బీబీనగర్, నడికుడి మార్గం రద్దీగా మారనుంది.
సింగిల్ ట్రాక్ కష్టాల నుంచి త్వరలో మోక్షం
దక్షిణ మధ్య రైల్వేలో బీబీనగర్-నడికుడి సింగిల్ ట్రాక్ వినియోగం 148.25శాతం ఉంది. సింగిల్ ట్రాక్ కావడంతో ఒక రైలు ప్రయాణిస్తుంటే ఎదురుగా వచ్చే రైలును ముందు స్టేషన్లలో గంటల తరబడి నిలపాల్సి వస్తోంది. గూడ్స్ రైళ్లు కూడా గంటల తరబడి నిలుస్తున్నాయి. రైతులు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బం ది ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో ఉన్న సింగిల్ ట్రాక్ గరిష్ఠ వేగం 130కి.మీలు మాత్రమే. ఇప్పటికే ఈ మార్గంలో 160కి.మీల వేగ సామర్ధ్యం ఉన్న రైళ్లు వేగాన్ని తగ్గించుకుని ప్రయాణిస్తున్నాయి. ఈ మార్గాన్ని డబ్లింగ్ చేస్తే రైళ్ల వేగం పెరగడంతో పాటు అదనపు రైళ్లు నడిపే అవకాశం ఉంటుంది. బీబీనగర్-గుంటూరు రైలు మార్గంలో డబ్లింగ్ చేస్తే 239కి.మీలల్లో 139కి.మీల రైల్వే ట్రాక్ తెలంగాణ పరిధిలో, 100కి.మీలు ఏపీ పరిధిలో ఉండనున్నాయి. డబ్లింగ్ పనులు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతయ్యే సిమెంట్, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభం కానుంది. ఈ మార్గంలోనే నడికుడి, జగ్గయ్యపేట, విష్ణుపురం, జాన్‌పహాడ్ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు ఈ రైల్వే లైన్ ఎంతగానో ఉపయోగపడనుంది.