Share News

అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:34 AM

అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి.సలీం, సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్యలు డిమాండ్‌ చేశారు.

అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
సీఐటీయూ నాయకులకు వినతిపత్రం ఇస్తున్న అంగన్‌వాడీ టీచర్లు

నల్లగొండ రూరల్‌, జనవరి 31: అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి.సలీం, సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్యలు డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టణంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలను వారు సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16న చేపట్టనున్న సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అంగన్‌వాడీ వ్యవస్థను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. పేదలకు పౌష్ఠికాహారం అందకుండా చేసేందుకు కేంద్రం పూనుకుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాదూరి లక్ష్మి, ప్రమీల, మణిరూప, రేణుక, జ్యోతి, యాదమ్మ, ప్రకృతాంబ, సునంద, సముద్రమ్మ, సరస్వతి, సునీత పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 12:34 AM