Share News

చాక్‌పీ్‌సపై అమరుల స్థూపం

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:27 AM

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి పదేళ్లు గడిచిన సందర్భంగా కోదాడకు చెందిన సూక్ష్మకళాకారుడు తమలపాకుల సైదులు అమరవీరుల స్థూపాన్ని తయారుచేశారు.

చాక్‌పీ్‌సపై అమరుల స్థూపం
సౖదులు రూపొందించిన చాక్‌పీస్‌పై అమరుల స్థూపం

కోదాడ, జూన 1: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి పదేళ్లు గడిచిన సందర్భంగా కోదాడకు చెందిన సూక్ష్మకళాకారుడు తమలపాకుల సైదులు అమరవీరుల స్థూపాన్ని తయారుచేశారు. మూడు సెంటీమీటర్ల చాక్‌పీ్‌సపై హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదుట ఉన్న అమరుల స్థూపాన్ని పోలినట్లుగా తయారుచేశాడు. ఇందుకోసం సుమారు గంట సమయం పట్టిందని సైదులు తెలిపారు. గతంలోనూ బియ్యం గింజలపై తెలంగాణ గీతం, బల్బులో గాంధీ, నెహ్రూ, ఎన్టీఆర్‌ చిత్రపటాలు, తెలంగాణ తల్లి విగ్రహాలను సైదులు తయారు చేసి అందరి మన్ననలు పొందాడు.

Updated Date - Jun 02 , 2024 | 12:27 AM