ఐలమ్మ పోరాట స్ఫూర్తి అనిర్వచనీయం
ABN , Publish Date - Sep 10 , 2024 | 11:59 PM
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్లు బెన్ షోలోమ్, కే.గంగాధర్ అన్నారు. కలెక్టరేట్‌లో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చాకలి ఐల మ్మ వర్ధంతిని నిర్వహించారు.
అదనపు కలెక్టర్లు బెన్ షాలోమ్, గంగాధర్
భువనగిరి అర్బన్, సెప్టెంబరు 10: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్లు బెన్ షోలోమ్, కే.గంగాధర్ అన్నారు. కలెక్టరేట్‌లో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చాకలి ఐల మ్మ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి పి యాదయ్య, డీఆర్‌డీవో టి.నాగిరెడ్డి, ఇన్‌చార్జి వైద్యాధికారి యశోద, డీపీవో ఆర్.సునంద, ట్రెజరీ అధికారి సంపూర్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈఈ జే.శ్యాంసుందర్, ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి ఎం.జయపాల్‌రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి సి.జగన్మోహన్ ప్రసాద్, జిల్లా ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి, రజక సంఘం సభ్యులు రత్నపురం పద్మ, జూపల్లి నగేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.