విద్యాశాఖలో మళ్లీ సర్ధుబాటు
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:29 AM
ప్రభుత్వ పాఠశాల ల విద్యార్థులందరికీ నాణ్యమై న విద్యను అర్హులైన ఉపాధ్యాయులతో బోధించే లక్ష్యంతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల సర్దుబాటు అధికారాలను కలెక్టర్‌కు అప్పగించింది. 2
భువనగిరి టౌన్, సెప్టెంబరు 20: ప్రభుత్వ పాఠశాల ల విద్యార్థులందరికీ నాణ్యమై న విద్యను అర్హులైన ఉపాధ్యాయులతో బోధించే లక్ష్యంతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల సర్దుబాటు అధికారాలను కలెక్టర్‌కు అప్పగించింది. 2021లో జారీచేసిన జీవో నెంబర్ 25 రేషనలైజేషన్ మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో కొన్ని పాఠశాలలో అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులు, కొరత ఉన్న పాఠశాలల్లో పనిచేయాల్సి ఉంటుంది. అయి తే విద్యాశాఖ నిర్ణయంతో పలు ప్రభుత్వ పాఠశాల ల్లో సబ్జెక్ట్ టీచర్లు, ఇతర ఉపాధ్యాయుల కొరత తాత్కాలికంగా తీరనుంది. కాగా, ఉమ్మడి జిల్లాలో 3,210 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 9వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా, 2,11,009 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.
ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరి..
విద్యార్థుల సంఖ్యమేరకు ఉపాధ్యాయులు ఉం డాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రా థమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతీ 40 మం ది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అ లాగే ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ టీచర్స్ ఉండాలి. అయితే యూపీఎ్‌సలలో 6,7,8 తరగతుల్లో 1 నుం చి 20మంది విద్యార్థులు ఉండే పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు తప్పనిసరి. అందులో ఒకరు సబె ్జక్ట్ టీచర్ కాగా, మరొకరు భాషా పండితుడు ఉం డాలి. 21 మంది పైబడి విద్యార్థులు ఉండే పాఠశాలలో విధిగా నలుగురు సబ్జెక్ట్ టీచర్లు ఉండాలి.
గతంలో పలు ఆరోపణలు
విద్యాశాఖలో కొన్ని విద్యాసంవత్సరాలుగా ఉపాధ్యాయుల సర్దుబాటు నడుస్తుండగా, ఏటా పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తొలుత కాంప్లెక్స్ పాఠశాల పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయు ల అవసరం ఉంటే అదే కాంప్లెక్స్ పరిధిలో అదనంగా ఉన్న వారిని సర్దుబాటు చే యాలి. ఆ కాంప్లెక్స్ పరిధిలో అదన పు ఉపాధ్యాయు లు లేకుంటే మండల పరి ధి నుంచి సర్దుబాటు చేయవచ్చు. మం డలంలో అం దుబాటు లేకుం టే పక్క మండలాల నుంచి, చివరగా జిల్లా యూ నిట్‌గా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే వెసులుబాటును రాష్ట్ర విద్యాశాఖ కల్పించింది. అయితే దీన్ని అవకాశంగా తీసుకున్న పలువురు ఎంఈవోలు, ఉపాధ్యాయులు వారికి అనుకూలమైన ప్రాంతాలకు వచ్చేందుకు పైరవీలు నడిపారు. ఈ వ్యవహారంలో డబ్బు చేతులు మారడంతో ఉపాధ్యాయులు వారనుకున్న ప్రాంతాలకు సర్దుబాటుపేరుతో వెళ్లినట్టు గతంలో పలువురు ఉపాధ్యాయులతోపాటు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపణలు చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని కొందరు డీఈవోలు సైతం పట్టించుకోపోవడంతో విద్యాశాఖ అబాసుపాలైంది. మళ్లీ రాష్ట్ర విద్యాశాఖ ప్రస్తుత విద్యాసంవత్సరంలో సర్దుబాటుకు వెసులు కల్పించిన నేపథ్యంలో ఈ సారైనా అక్రమాలకు తావులేకుండా ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తిచేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
డీఎస్సీ అభ్యర్థులు వచ్చే ముందు సర్దుబాటు ఎందుకో?
ఇటీవల ప్రభుత్వం 11,062 పోస్టులకు డీఎస్సీని నిర్వహించింది. నల్లగొండ జిల్లాలో 605, సూర్యాపేటలో 386, యాదాద్రిలో 277 పోస్టులకు అభ్యర్థులు పరీక్ష రాశారు. జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు జరగ్గా, ఇప్పటికే ఫైనల్ కీని విడుదల చేసింది. ఈ కీలో కూడా తప్పులు ఉన్నాయని అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో తప్పులను సవరించి ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో జీఆర్‌ఎల్ (జనరల్ ర్యాంక్ లిస్ట్)ను విడుదల చేయాలని విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. అదే జరిగితే వచ్చే నెలలో నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. వచ్చే నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు ఉన్నాయి. ఈ లోగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సర్దుబాటు ప్రక్రియ చేపట్టడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పాఠశాలల్లో ఉపాధ్యాయుల కేటాయింపు ఇలా..
ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల
విద్యార్థులు టీచర్లు విద్యార్థులు టీచర్లు
1-10 1 1-220 7
11-60 2 221-250 8
61-90 3 251-280 9
91-120 4 281-310 10
121-152 5 311-340 12
153-200 6 341-370 13
ప్రతీ 40 మందికి ఒకరు 371-400 14