Share News

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

ABN , Publish Date - May 20 , 2024 | 11:49 PM

నకిలీ విత్తనా లు అరికట్టడంలో డీల ర్లు సహకరించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హనుమంతు కే. జెండగే విత్త న డీలర్లను హెచ్చరించారు. కలెక్టరేట్‌లో సో మవారం డీసీపీ రాజే్‌షచంద్ర, వ్యవసాయ అధికారి అనురాధతో కలిసి డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

 నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

భువనగిరి అర్బన్‌, మే 20 : నకిలీ విత్తనా లు అరికట్టడంలో డీల ర్లు సహకరించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హనుమంతు కే. జెండగే విత్త న డీలర్లను హెచ్చరించారు. కలెక్టరేట్‌లో సో మవారం డీసీపీ రాజే్‌షచంద్ర, వ్యవసాయ అధికారి అనురాధతో కలిసి డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తన డీలర్లు రాబోయే వానాకాలం సీజన్‌కు సంబంధిం చి రైతాంగానికి నాణ్యతతో కూడిన విత్తనాలు అందజేయాలన్నారు. అనుమతి లేని విత్తనా లు, నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా నివారించేందుకు నాలుగు మండలాలకు ఒకటి చొప్పున నాలుగు టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి బృందంలో వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఇద్దరు వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసు అధికారులు ఉం టారని తెలిపారు. నకిలీ విత్తనాలు రవాణా కాకుండా జాతీయ రహదారులపై నిఘా పెంచామన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ డైరెక్టర్లు దేవిసింగ్‌, పద్మావతి, వెంకటేశ్వర్లు, నీలిమ, విత్తన డీలర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు బజ్జూరి రవి, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హనుమంతు కే. జెండగే అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. భువనగిరి డివిజన్‌కు సంబంధించి 22, చౌటుప్పల్‌కు సంబంధించి 15తో కలిపి 37 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ నెల 27న ఓటింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 34,080మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణ కు సంబంధించి 12మంది సెక్టార్‌ అధికారులు, ఆరుఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, 17 స్పెషల్‌ వీడియో, 17ఎంసీసీ టీంలు పర్యవేక్షిస్తాయన్నారు. శిక్షణలో భువనగిరి ఆర్డీవో అమరేందర్‌, జిల్లా స్థాయి శిక్షకులు నర్సిరెడ్డి, హరినాథ్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు.

Updated Date - May 20 , 2024 | 11:49 PM