Share News

అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు

ABN , Publish Date - Jan 06 , 2024 | 12:13 AM

అధికారులు అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మందుల సామేల్‌ అన్నారు. శుక్రవారం మద్దిరాల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు

ఎమ్మెల్యే సామేల్‌

మద్దిరాల, జనవరి 5: అధికారులు అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మందుల సామేల్‌ అన్నారు. శుక్రవారం మద్దిరాల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాల్లో వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకరావాలన్నారు. అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పేదలకు ప్రభు త్వం అందజేసే సంక్షేమ పథకాలను వారికి అందేలా చూడాలన్నారు. ఏ ఒక్క నిరుపేదకు అన్యాయం జరగవద్దన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గుడ్ల ఉపేంద్రవెంకన్న, జడ్పీటీసీ కన్న సురాంబవీరన్న, తహసీల్దార్‌ అమీన్‌సింగ్‌, ఎంపీడీవో సరోజ, ఎంపీవో రాజేష్‌, అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

సమన్వయంతో పని చేయాలి

నూతన్‌కల్‌, జనవరి 5: ప్రజాప్రతినిదులు, అధికారులు సమన్వయంతో ప ని చేసి గ్రామాల అబివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నా రు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన ప్రభుత్వంలో ప్రజలంద రూ అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాళ దామోదర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివా్‌సరా వు, ఎంపీడీవో ఇందిర, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మూసీ వాగు వరకు పైపులైన్‌

అర్వపల్లి, జనవరి 5: మూసీ ఎగువ నుంచి వచ్చే వరదతో పొలాలు మునిగిపోకుండా ఎంత ఖర్చు అయినా మూసీ వాగు వరకు పైపులైన్‌ వేయాలని ఎమ్మెల్యే సామేల్‌ తెలిపారు.రూ.1.30లక్షల వ్యయంతో గూనలు ఏర్పాటుచేసే ప్రదేశాన్ని ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. పూర్తిగా నీటిని తొలగిం చి దళిత రైతులకు సేద్యం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి కే 80శాతం మురుగు నీరు మూసీ వాగులోకి తరలించామని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. పూర్తిగా నీటిని తొలగించాలని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు సూచించారు. దీంతో భూములున్న రైతులు సంతోషం వ్యక్తం చేసి ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షు డు దరూరి యోగనందచార్యులు, అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, ఎంపీటీసీ నర్సింగ్‌ నాగమ్మశ్రీనివా్‌సగౌడ్‌, బైరబోయిన మహారాజు, మోరపాక సత్యం, సిగ నసీర్‌గౌడ్‌, రింగు బాలయ్య, కృష్ణమూ ర్తి, జలేందర్‌, సోమయ్య, రాంమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 12:13 AM