Share News

ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:59 AM

మునిసిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాలన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తప్పవని ఎ మ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునిసిపాలిటీలో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, ఇండోర్‌ స్టేడియం నిర్మాణాన్ని పరిశీలించి, కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుకున్నారు.

ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్‌ మునిసిపాలిటీ, జనవరి 7: మునిసిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాలన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తప్పవని ఎ మ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునిసిపాలిటీలో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, ఇండోర్‌ స్టేడియం నిర్మాణాన్ని పరిశీలించి, కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయ న మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ పాలనలో కాంట్రాక్టర్లు దోపిడీకి పాల్పడ్డారని అన్నారు. ఈ ప్రాంతంలోని రైతులకు సాగునీరు అందించేందుకు పిలాయిపల్లి కాల్వను తీసుకువస్తే 10 ఏళ్లుగా కాల్వ నిర్మాణాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయిందన్నారు. అనంతరం చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీచేసి ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్‌ క్లినిక్‌లు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కెమికల్‌ కంపెనీలు వ్యర్థాల ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇండోర్‌ స్టేడియానికి కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తేగా, స్పందించిన ఆయన ఆర్డీవోను పిలిచి సర్వే చేసి స్థలాన్ని రక్షించాలని ఆదేశించారు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో, మునిసిపల్‌ కమిషనర్‌, పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలం చూడాలని సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, కౌన్సిలర్స్‌ కోయ్యడ సైదులు, ఎండి.బాబాషరీప్‌, సందగళ్ల విజయసతీష్‌, అంజయ్య, బోయ దేవేందర్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అలివేలు, ఎక్సైజ్‌ సీఐ నాగలక్ష్మి, పాల్గొన్నారు.

చౌటుప్పల్‌ రూరల్‌: మండలంలోని ఎస్‌.లింగోటం, చిన్నకొండూర్‌ గ్రామాల పరిధిలోని పిలాయిపల్లి కాల్వను ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పరిశీలించారు.

Updated Date - Jan 08 , 2024 | 12:59 AM