Share News

అసదొద్దీన్‌ ఓవైసీపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:47 AM

హైదరాబాద్‌ ఎంఐఎం ఎంపీ అసదొద్దీన్‌ ఓ వైసీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణాధ్యక్షుడు రత్నపురం బలరాం, బీజేవైఎం జిల్లా కార్యదర్శి బట్టు క్రాంతి అన్నారు.

అసదొద్దీన్‌ ఓవైసీపై చర్యలు తీసుకోవాలి

బీజేవైఎం, బీజేపీ నేతల డిమాండ్‌

భువనగిరి టౌన్‌, జూన్‌ 26: హైదరాబాద్‌ ఎంఐఎం ఎంపీ అసదొద్దీన్‌ ఓ వైసీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణాధ్యక్షుడు రత్నపురం బలరాం, బీజేవైఎం జిల్లా కార్యదర్శి బట్టు క్రాంతి అన్నారు. ఈమేరకు బుధవారం భువనగిరిలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఎంపీ ఓవైసీ దిష్టిబొమ్మను దహనంచేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వ అంతర్జాతీయ విధానాలను వ్యతిరేకించే వారంతా దేశ వ్యతిరేకులేనన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా జై పాలస్తీనా నినాదం చేసి రాజ్యాంగాన్ని అగౌరవపరిచాడన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు కె.మల్లికార్జున్‌, ఆర్‌.ప్రవీణ్‌కుమార్‌, కందా డి శ్రీధర్‌, రావుల సంతోష్‌, నెమిలె నందు, కొత్త మహేందర్‌, కడారి కృష్ణ, రాఘవేందర్‌, రమేశ్‌, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎండీ మహమూద్‌, డి.లక్ష్మీనారాయణ గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 12:47 AM