Share News

మహిళల మెడలోనుంచి నగల అపహరణ

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:40 AM

వేర్వేరు చోట్ల నిద్రిస్తున్న ఇద్దరు మహిళల మెడలోనుంచి బంగారు, గిల్ట్‌ నగలను దొంగలు అపహరించారు.

 మహిళల మెడలోనుంచి నగల అపహరణ

భువనగిరి రూరల్‌, ఏప్రిల్‌ 15: వేర్వేరు చోట్ల నిద్రిస్తున్న ఇద్దరు మహిళల మెడలోనుంచి బంగారు, గిల్ట్‌ నగలను దొంగలు అపహరించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్‌ కుషాయిగూడకు చెందిన మద్దూరి శిరీష భువనగిరి పట్టణ శివారులో మద్దూరి రవీందర్‌రెడ్డి ఇంట్లో జరిగిన దుర్గమ్మ పండుగకు వచ్చింది. ఆదివారం రాత్రి రవీందర్‌రెడ్డి దాబాపై నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో చొరబడి శిరీష మెడలోంచి రూ.2తులాల బంగారు పుస్తెల తాడును కత్తిరించుకొని పోయారు. ఆమె నిద్రలోంచి లేచి కేకలు వేయగా అప్పటికే నిందితుడు పరారయ్యాడు. ఇదే కాలనీలో ఇంటి వరండాలో నిద్రిస్తున్న కొమ్ము మాధవి మెడలోని గిల్ట్‌ (రోల్డ్‌ గోల్డ్‌) పుస్తెల తాడును కూడా అపహరించుకు పోయారు. ఈ విషయమై భువనగిరి రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఏసీపీ ఈ రవి కిరణ్‌రెడ్డి, రూరల్‌ సీఐ ఎం ప్రభాకర్‌రెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ వారణాసి సంతో్‌షకుమార్‌లు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. మహిళలు బంగారు ఆభరణాలు ధరించి ఆరుబయట నిద్రించొద్దని సూచించారు.

Updated Date - Apr 16 , 2024 | 08:05 AM