గొర్రెల స్కాంలో అధికారులకు బిగుస్తున్న ఉచ్చు
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:14 AM
గొర్రెల స్కాంలో జిల్లాలోని వివి ధ శాఖల అధికారులతో పాటు జిల్లా పశుసంవర్ధక శాఖలో పాత్రధారులైన అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గొర్రెల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపు విషయంలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటికే చంచల్‌గూడ జైలులో వయోజన విద్య డీడీ
డిప్యూటేషన్‌పై వెళ్లి గొర్రెలను కొనుగోలు చేసిన అధికారులు
ఏసీబీ విచారణలో పలు విషయాలు వెలుగులోకి
కలెక్టరేట్‌లో పైళ్ల క్లియరెన్స్ ఇక కష్టతరమే
నల్లగొండ, మార్చి 5: గొర్రెల స్కాంలో జిల్లాలోని వివి ధ శాఖల అధికారులతో పాటు జిల్లా పశుసంవర్ధక శాఖలో పాత్రధారులైన అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గొర్రెల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపు విషయంలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కో రైతు నుంచి 10నుంచి 12యూనిట్ల గొర్రెలు మాత్రమే కొనుగోలు చేయా లి. కానీ, నల్లగొండలో మాత్రం అందుకు విరుద్ధంగా దళారుల నుంచి పెద్ద మొత్తంలో యూనిట్లను కొనుగోలు చేసి న అధికారులు చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రస్థాయిలో ఒక కీలకమైన ప్రజాప్రతినిధితో పాటు ఓ ఉన్నతాధికారి సూచనతో ఈ అవినీతికి తెరతీసినట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన నలుగురు అధికారుల్లో నల్లగొండ వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్ కూడా ఉన్నారు. అరెస్టు తరువాత ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించడమే గాక, ఆయన స్థానంలో యాదా ద్రి జిల్లాకు చెందిన ఓ అధికారికి డీడీగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దీనికి తోడు వయోజన విద్యలో కీలకమైన సెక్షన్ పనులను నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతికి కేటాయించారు. ఇక ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించగా, నల్లగొండకు చెందిన వయోజన విద్య అధికారి గణేష్ పలు కీలకమైన అంశాలు ఏసీబీ అధికారులకు చెప్పినట్టు వినికిడి. ప్రస్తు తం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు.
డిప్యూటేషన్‌పై వెళ్లిన అధికారులపైనా విచారణ?
గత ప్రభుత్వం గొర్రెల కొనుగోళ్ల కోసం ఇతర రాష్ట్రాల కు వెళ్లేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు ఇతర శాఖలకు చెందిన అధికారులకు సైతం బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు నల్లగొండ జిల్లాలోని వివిధ కీలకమైన శాఖలకు చెందిన ఉన్నతాధికారులు గొర్రెల కొనుగోళ్లలో ప్రధాన పాత్ర పోషించారు. అందులో పలువురు దళారుల వద్దే గొర్రెల ను సేకరించే విషయంలో ఉత్సాహం చూపినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నల్లగొండ జిల్లాలో 1,066 యూనిట్ల ఫైలు ప్రకారం సుమారు రూ.15కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అందులో రూ.12కోట్ల మేర దళారులకే చెల్లించాల్సి రావడం వివాదాస్పదంగా మా రింది. ఈ విషయాన్ని అప్పటి నల్లగొండ జిల్లా కలెక్టర్ కర్ణన్ పరిశీలించి ఫైల్‌ను పక్కన పెట్టారు. అదేవిధంగా ప్రస్తుత కలెక్టర్ హరిచందన సైతం పైల్‌ను స్టడీ చేయా ల్సి ఉందని పశుసంవర్ధకశాఖ అధికారులకు స్పష్టం చేశా రు. ఆ ఫైల్‌తోపాటు జరిగిన పొరపాట్లను, అక్రమాలను, అవినీతిని గ్రహించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇక ఆ ఫైల్‌కు మోక్షం కలిగే ప్రసక్తి లేదని పశుసంవర్ధక శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇతర శాఖల నుం చి డిప్యూటేషన్‌పై వెళ్లిన అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. వారిని కూడా త్వరలోనే ఏసీబీ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వారందరినీ విచారిస్తే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైల్ పెండింగ్ విషయంపై పశుసంవర్ధకశాఖ జేడీ సుబ్బారావును పలుమార్లు ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, ఫైల్ కలెక్టరేట్‌లోనే పెండింగ్‌లో ఉందని స్పష్టం చేస్తున్నారు. అయితే ఆ ఫైల్‌లో ఉన్న అంశాల గురించి మా త్రం తనకు తెలియదని చెబుతున్నారు. ప్రధానంగా నల్లగొండ జిల్లాలో 1,172 నకిలీ ఇన్‌వాయి్‌సలకు చెల్లింపులు చేసినట్టు కాగ్ నివేదికలో వెల్లడించింది. మొత్తానికి వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్ అరెస్ట్ కావడం జైలుకు వెళ్లడంతో పాటు ఇటీవల ఏసీబీ అధికారుల కస్టడీలో ఎలాంటి విషయం వెల్లడించారనే దానిపై జిల్లా అధికారుల్లో భయాందోళన మొదలైంది.