Share News

చేనేత సమస్యలపై త్వరలో సమీక్ష

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:45 AM

చేనేత రంగంలోని కా ర్మికులు,పారిశ్రామికులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వర లో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని,చేనేత సమస్యల సాధ న కోసం కృషి చేస్తానని చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.

చేనేత సమస్యలపై త్వరలో సమీక్ష

చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

భూదాన్‌పోచంపల్లి, జనవరి 8: చేనేత రంగంలోని కా ర్మికులు,పారిశ్రామికులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వర లో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని,చేనేత సమస్యల సాధ న కోసం కృషి చేస్తానని చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. సోమవారం భూదాన్‌పోచంపల్లికి చెందిన పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు గంజి యుగేందర్‌, గౌరవాధ్యక్షుడు సూరపల్లి రాము ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు మంత్రి తుమ్మలను కలిసి చేనేత సమస్యలపై విన తి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పద్మశాలి యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ, చేనేత రుణాలను మాఫీ చేయాలని, త్రిఫ్ట్‌ పథకాన్ని కొనసాగిస్తూ కార్మికులంద రూ ఈ పథకాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాల ని కోరారు. పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్కును రాష్ట్ర ప్రభు త్వం కొనుగోలు చేసి, స్వాధీనం చేసుకున్నా నేత కార్మికులకు ఉపాధి కల్పించే చర్యలు చేపట్టలేదన్నారు. పోచంపల్లి హ్యాం డ్లూమ్‌ పార్కు ద్వారా కార్మికులకు పని కల్పించి ఆదుకోవాల ని కోరారు. చేనేత బీమాకు వయసుతో నిమిత్తం లేకుండా వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న అందరికీ అమలు చే యాలని, చేనేత ఇక్కత్‌ చీరలను మిల్లులు ప్రింటింగ్‌ చేయకుండా జీఐఏ యాక్ట్‌ను అమలు చేయాల కోరారు. మిల్లులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించి కఠిన చర్య లు తీసుకోవాలని కోరారు. చేనేత మిత్ర పథకాన్ని అమలు చే యాలని, సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి త్వరలో సమీక్షా సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రుద్ర చందు, ధర్మేందర్‌, నవీన్‌, పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:45 AM