Share News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:53 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అడ్డగూడూరు, మార్చి 8: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్ధులు తెలిపిన వివరాల ప్రకారం... అడ్డగూడూరు మండలం, కొడంపేట గ్రామానికి చెందిన గొలుసుల వెంకన్న (50) పది సంవత్సరాల క్రితం ఉపాధి కోసం హైదరాబాదులోని మల్లంపేటలో నివాసం ఉంటున్నాడు. సొంతంగా సిమెంట్‌ బ్రిక్స్‌ ఇటుకలను తయారు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన సొంత గ్రామమైన కొడంపేటకు వచ్చి కారులో తిరిగి వెళుతుండగా గురువారం రాత్రి హైదరాబాదులోని ఓఆర్‌ఆర్‌ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గొలుసుల వెంకన్న అక్కడిక్కడే మృతి చెందాడు. కారు నడుపున్న వెంకన్న అల్లుడు మురళికి తీవ్ర గాయాలయ్యాయి. మురళిని చికిత్స నిమిత్తం హైదరాబాదులోని ఒక ప్రైయిట్‌ ఆస్పుప్రతికి తరలించారు. వెంకన్నకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కూమారుడు ఉన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 08:43 AM