Share News

యాదగిరీశుడి సన్నిధిలో వైభవంగా తెప్పోత్సవం

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:26 AM

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నృసింహుడి సన్నిధిలో మంగళవారం తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు.

 యాదగిరీశుడి సన్నిధిలో వైభవంగా తెప్పోత్సవం
యాదగిరిగుట్ట కొండపైన విష్ణుపుష్కరిణిలో తెప్పోత్సవంలో స్వామి అమ్మవార్ల విహారం

భువనగిరి అర్బన, ఏప్రిల్‌ 23: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నృసింహుడి సన్నిధిలో మంగళవారం తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున విష్ణుపుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ లక్ష్మీసమేతుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. కవచమూర్తులను బంగారు ఆభరణాలు, వివిధ పుష్పమాలికలతో దివ్యమనోహరంగా అలంకరించి తిరువీధులవెంట ఊరేగింపుగా వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్కరిణి వద్ద కు సేవను తరలించారు. కొండపైన విష్ణుపుష్కరిణిలో తెప్పలో మూడుసార్లు జలవిహారం చేశారు. వైభవంగా సాగిన తెప్పోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గంగాజలాన్ని స్వీకరించారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత తొలిసారి తెప్పోత్సవం నిర్వహించడం విశేషం. కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ప్రధానార్చకులు నల్లంథిఘల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఆలయ ఏఈవో దూశెట్టి కృష్ణ, ఆలయ పర్యవేక్షకులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

క్షేత్రపాలకుడికి నాగవల్లి దళార్చనలు

గుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆం జనేయస్వామికి నాగవల్లి దళార్చనలు, నృసింహుడికి నిత్య పూజలు శాసో్త్రక్తంగా జరిగాయి. కొండపైన విష్ణుపుష్కరిణి వద్ద ఆంజనేయస్వామికి వేదమంత్రాలతో పంచామృతాభిషేకం చేసిన అర్చకులు సింధూరం, వివిధ రకా ల పూలతో అలంకరించారు. ఆంజనేయుడికి సహస్రనామ పఠనాలతో నాగవళ్లీ దళార్చనలు చేపట్టారు. ప్రధానాలయంలోని స్వయంభువులను సుప్రభాత సేవతో మేల్కొలిపి నిజాభిషేకం, నిత్యార్చనలు ముఖమండపంలో సు దర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం పాంచరాత్రాగమశాస్త్రరీతిలో నిర్వహించారు.ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.16, 90,140 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

27 రోజుల్లో రూ.2.30కోట్ల హుండీ ఆదాయం

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయ ఖజానాకు 27 రోజుల్లో రూ.2.30కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. మార్చి 27 నుంచి ఈ నెల 22వ తేదీ వరకు క్షేత్ర సందర ్శనకు వచ్చిన భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను ఈవో భాస్కరరావు, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి పర్యవేక్షణలో సిబ్బంది మంగళవారం లెక్కించారు. నగదు రూ. 2,30,76,344, మిశ్రమ బంగారం 147 గ్రాములు, 4.9 కిలోల మిశ్రమ వెండిని ఆలయ ఖజానాలో జమచేసినట్లు ఈవో భాస్కరరావు తెలిపారు. విదేశీ కరెన్సీ 753 అమెరికా డాలర్లు, 45 ఇంగ్లండ్‌ పౌండ్లు, యూఏఈ 230 దిరమ్స్‌, మలేషియా 10 రింగిట్స్‌, యూరప్‌ 10 యూరోలు, నేపాల్‌ 10 రూపీస్‌, కెనడా 180 డాలర్లు, భూటాన 12 గుల్ట్రమ్‌, సౌదీ అరేబియన 53 రియల్‌, సింగపూర్‌ 11 డాలర్లు, ఇండోనేషియా 50,000 రూపీయా, శ్రీలంక 100 రూపీ, స్వీడన 20 క్రోనా కానుకలుగా సమకూరాయని తెలిపారు.

Updated Date - Apr 24 , 2024 | 12:26 AM