Share News

ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి లాంటిది: సీడీపీవో

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:36 AM

ఆడపిల్ల జన్మిస్తే ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని భావించాలని మోత్కూరు సీడపీవో జ్యోత్స్న అన్నారు.

ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి లాంటిది: సీడీపీవో

మోత్కూరు/ రామన్నపేట, జనవరి 11: ఆడపిల్ల జన్మిస్తే ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని భావించాలని మోత్కూరు సీడపీవో జ్యోత్స్న అన్నారు. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో బేటీ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా సాధికారత బృందం మోత్కూరు అంగనవాడి కేంద్రం-1లో గురువారం నిర్వహించిన ఆడపిల్లల తల్లుల సన్మానంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆడపిల్లల పట్ల వివక్ష చూపవద్దని, ఆడ పిల్లలను బాగా చదివించి ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్నారు. సన్మానం సందర్భంగా ఆడ పిల్లల కన్న తల్లులకు చీరలు, పిల్లలకు ఫ్రాకులు అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ మంగమ్మ, డీహెచఈడబ్ల్యూ హర్ష, నికిత, అంగనవాడీ టీచర్‌ సునీత పాల్గొన్నారు. రామన్నపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ హేమలత, డీహెచఈడబ్ల్యూ బృందం సభ్యులు భార్గవి, సుమలత, అంనవాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:36 AM