13 కిలోమీటర్ల దూరం.. ఐదు నిమిషాల్లో ఔషధాలు
ABN , Publish Date - Jan 06 , 2024 | 12:21 AM
రోగులకు అత్యవసరంగా పరీక్షలు చేయాలన్నా...మందులు కావాలన్నా సంబంధిత ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుం ది.
వైద్యానికి సాంకేతికత తోడు
అత్యవసర సేవలకు డ్రోన
పీహెచసీల నుంచి శ్యాంపిల్స్, మందుల పంపిణీకి చర్యలు
యాదాద్రి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రోగులకు అత్యవసరంగా పరీక్షలు చేయాలన్నా...మందులు కావాలన్నా సంబంధిత ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుం ది. ప్రస్తుతం సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ పెరుగుతుండటంతో, వైద్య రంగానికి సాంకేతికతను తోడు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అత్యవసర సేవలందించేందుకు ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి రోగులకు సంబంధించిన శ్యాంపిల్స్, మందుల పంపి ణీ ఇక నుంచి డ్రోనల ద్వారా సరఫరా చేసేందుకు ఓ ఔత్సాహిక బృందం ట్రయల్‌రన చేపట్టింది. రోగులకు అత్యవసర సేవలందించేందుకు యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆధ్వర్యంలో తగిన చర్యలు చేపడుతోంది. ఆస్పత్రుల్లోని రోగుల నుంచి సేకరించిన పలు శాంపిళ్లను వేగంగా ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయడంతోపాటు మందులను తరలించేందుకు డ్రోన సేవలను వినియోగించనుంది. ఈ మేరకు గత మూడురోజులుగా భువనగిరి, బీబీనగర్ మండలాల పరిధిలోని పీహెచసీల నుంచి ట్రయల్‌రన నిర్వహించింది. పైలెట్ ప్రాజెక్టు కింద ఎయి మ్స్ నుంచి భువనగిరి మండలం బొల్లేపల్లి పీహెచసీకి, అక్కడ నుంచి భువనగిరి ఆసుపత్రికి 25కిలోల బరువు ఉన్న మందులను డ్రోన ద్వారా సరఫరా చేశారు. ఎయి మ్స్ నుంచి భువనగిరికి 13కిలోమీటర్లు ఉం టుంది. డ్రోన ద్వారా మందుల పంపిణికీ కేవలం 5నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. బీబీనగర్ మండలం కొండమడుగు, బొమ్మలరామారం మండలం కేంద్రంలోని పీహెచసీలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఆసుపత్రు ల్లో క్షయతోపాటు ఇతర రోగులకు సంబంధించిన శ్యాంపిల్స్‌ను డ్రోన ద్వారా భువనగిరి ఏరియా ఆస్పత్రిలోని ల్యాబ్‌కు పంపించి, పరీక్షలు చేపట్టి...పరీక్షల వివరాలతో పాటు మందులను కూడా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ ట్రయల్ రన విజయవంతం అయిన పక్షంలో మందుల సరఫరాకు వైద్య ఆరోగ్యశాఖ, ఎయిమ్స్ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఎయిమ్స్ పరిసరాల్లోని ఆస్పత్రులకు అత్యవసరంగా రోగులకు సంబంధించి పలు పరీక్షల శాంపిళ్లు, మందుల సరఫరాకు కేవలం 10నిమిషాలలోపే సమయం పడుతుందని ట్రయల్‌రనలో తేలింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే డ్రోన సేవలు అందుబాటులోకి రానున్నాయి.