Share News

ఎన్డీఏ కూటమికి 400 సీట్లు

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:43 AM

పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో బీజే పీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని బీజేపీ జాతీ య కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు. ఆదివారం భువనగిరిలో జరిగిన భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్డీఏ కూటమికి 400 సీట్లు

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

భువనగిరి టౌన్‌, మార్చి 10: పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో బీజే పీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని బీజేపీ జాతీ య కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు. ఆదివారం భువనగిరిలో జరిగిన భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ విజయాన్ని అడ్డుకునేందుకు ఇండియా కూటమి చేస్తున్న ప్రయత్నాలన్నీ వృథా అని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనను దేశం మరోమారు కోరుకుంటున్నదని, మోదీ నాయకత్వాన్ని అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదన్నారు. రాష్ట్రంలో గతం కంటే మెరుగైన సీట్లు సాధిస్తామన్నారు. ఆ విజయోత్సవంలో భువనగిరి నియోజకవర్గాన్ని కూడా నిలిపే బాధ్యత కార్యకర్తలదన్నారు. అయోధ్య రామమందిరం నిర్మాణం, ట్రిపుల్‌ తలాక్‌, 370 ఆర్టికల్‌ రద్దు తదితర సంచలన నిర్ణయాలతో పాటు మోదీ పాలనతో బీజేపీ గెలుపు ఖాయమైందన్నారు. భువనగిరి బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడు తూ, దేశాన్ని అగ్ర రాజ్యంగా తీర్చేందుకు పదేళ్లుగా శ్రమిస్తున్న ప్రధాని మోదీకి అండగా నిలిచే సమయం భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఆసన్నమైందన్నారు. మూడోసారి ప్రధాని మోదీయేనని ఈ పాటికే స్పష్టమైన నేపథ్యంలో భువనగిరి బీజేపీ ఎంపీని గెలిపించి మోదీకి కా నుకగా ఇవ్వాలని కోరారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఎన్‌వీఎ్‌సఎ్‌స ప్రభాకర్‌, గంగిడి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల షెడ్యూల్‌ త్వరలో వెలువడుతుందని, ఇప్ప టి నుంచే కార్యకర్తలు, నాయకులు సన్నద్ధం కావాలని, ఇంటింటా ప్రచా రం ప్రారంభించాలని సూచించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాశం భాస్కర్‌, యన్నం శివకుమార్‌, ఊట్కూరి భాస్కర్‌గౌడ్‌, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ మాయ దశరథ, పార్లమెంట్‌ కన్వీనర్‌ లింగస్వామి, పి.పాపారావు, తదితరులు పాల్గొన్నారు.

హమాలీ కార్మికులు కేంద్ర పథకాలను వినియోగించుకోవాలి

యాదగిరిగుట్ట రూరల్‌: హమాలీ కార్మికుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని బీజేపీ జాతీయ కా ర్యదర్శి సత్యకుమార్‌ తెలిపారు. ఆదివారం గుట్టలో హమాలీ కార్మికుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుట్టలో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి చాయ్‌ పే చర్చ కార్యక్రమంలో పా ల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు పడాల శ్రీనివాస్‌, కర్రె ప్రవీణ్‌, గుంటిపల్లి సత్యనారాయణ, రచ్చ శ్రీనివాస్‌, చిరిగె శ్రీనివాస్‌, అశోక్‌, అచ్చయ్య, శ్యామ్‌సుందర్‌, ప్రభాకర్‌, కర్రె శ్యామ్‌, పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:43 AM