3 రోజులు ఆర్టీసీ ఆదాయం రూ.6.46కోట్లు
ABN , Publish Date - Aug 21 , 2024 | 12:33 AM
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు రాఖీ పర్వది నం కలిసి వచ్చింది. ప్రతీ పండుగకు మాదిరిగానే రాఖీకి సైతం ఆర్టీసీ గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు బస్సులను అధిక సంఖ్యలో నడిపించిం ది.
ఆర్టీసీ ఆల్‌టైం రికార్డు
కలిసొచ్చిన రక్షాబంధన్
ఒక్క రోజే రూ.2.55కోట్ల ఆదాయం
ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్న మహిళలు
నల్లగొండ: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు రాఖీ పర్వది నం కలిసి వచ్చింది. ప్రతీ పండుగకు మాదిరిగానే రాఖీకి సైతం ఆర్టీసీ గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు బస్సులను అధిక సంఖ్యలో నడిపించిం ది. దీంతో సంస్థకు ఆదా యం పెద్ద మొత్తంలో సమకూరింది. మూడు రోజుల్లో రూ.6.46కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీ సీ కార్గో ద్వారా రాఖీల ను, ఇతర సామగ్రి పంపే వెసులుబాటు కల్పించడంతో సంస్థకు మరింత ఆదాయం సమకూరింది.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పర్వదినం సందర్భంగా ప్రయాణ ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో నల్లగొండ రీజియన్‌లోని ఏడు డిపోల పరిధిలో 645 బస్సు సర్వీసులను అధికారులు నడిపించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకొని అధిక సంఖ్యలో బస్సుల్లో ప్రయాణించారు. అదేవిధంగా పురుషుల ప్రయాణంతో ఆదా యం సమకూరింది. రీజియన్ పరిధిలోని ఏడు డిపోల పరిధిలో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడిపారు. అదేవిధంగా నాన్‌స్టా ప్ బస్సులను సైతం రీజియన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి హై దరాబాద్‌తో పాటు ఇతర నగరాలకు, ముఖ్య పట్టణాలకు నడపడంతో వల్ల ఆదాయం పెరిగింది. మహాలక్ష్మి పథకం కింద మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పల్లె వెలుగుతో పాటు ఎక్స్‌ప్రెస్ బస్సుల ను నడిపి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని బస్ స్టేషన్లలోనూ మూడు రోజులపాటు ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు కిటకిటలాడాయి. ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం కావడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలకు బదులు ఆర్టీసీ బస్సుల్లోనే అధికంగా ప్రయాణించారని అధికారులు పేర్కొంటున్నారు.
రూ.6.46కోట్లకు పైగా ఆదాయం
రీజియన్ పరిధిలోని ఏడు డిపోల్లో మొత్తం 645 బస్సు సర్వీసులు రా ఖీ పండగ సందర్భంగా నడిచాయి. ఈ నెల 17న మొత్తం 2,98,951 మంది ప్రయాణించగా, అందులో మహాలక్ష్మి ప్రయాణికులు 1,84,346 మంది ఉన్నారు. మొత్తం ఆదాయం రూ.1,89,11,000 ఆదాయం వచ్చింది. 18న మొత్తం 3,04,372 మంది ప్రయాణించగా, అందులో మహిళా ప్రయాణికులు 1,85,771 మంది ఉండగా, రూ.2,02,49,000 ఆదాయం వచ్చింది. 19న 3,78,982మంది ప్రయాణించగా, మహాలక్ష్మి ప్రయాణికు లు 2,52,506 మంది ఉండగా, రూ.2,55,03,000 ఆదాయం వచ్చింది. మూడు రోజుల్లో ఏడు డిపోల పరిధిలో 9,82,305 మంది ప్రయాణించ గా, మహాలక్ష్మి కింద 6,22,623మంది మహిళలు ప్రయాణించగా, పురుష ప్రయాణికులు 3,59,682 మంది ఉన్నారు. మొత్తంగా ఏడు డిపోల పరిధి లో రూ.6,46,63,000 ఆదాయం సమకూరింది.
8,23,976లక్షల కిలోమీటర్ల బస్సుల ప్రయాణం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏడు డిపోల పరిధిలో మొత్తం 645 బస్సులు 8,23,976 కిలోమీటర్లు ప్రయాణించాయి. 17న 2,61,112కిలోమీటర్లు, 18న 2,70,167కిలోమీటర్లు, 19న 2,92,697 కిలోమీటర్లు ప్రయాణిం చి మొత్తం 9,82,305 మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాల కు చేరవేశాయి. రక్షాబంధన్ సందర్భంగా ఆర్టీసీకి మూడు రోజుల్లో ఆల్ టైం రికార్డు ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొంటున్నారు. పండుగ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు సెలవులు వినియోగించుకోకుండా ప్రయాణికులకు సేవలందించారు.
దేవరకొండ డిపో మొదటిస్థానం
దేవరకొండ: రాఖీ సందర్భంగా ఈనెల 19న దేవరకొండ ఆర్టీసీ డిపో ఆదాయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజియన్ పరిధి లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మంగళవారం దేవరకొండ డిపోలో ఉద్యోగులు, కార్మికులతో కలిసి కేక్ కట్‌చేసి స్వీట్లు పంపిణీచేసి సంబరా లు నిర్వహించారు. రాఖీ రోజున దేవరకొండ డిపో రూ.46.78లక్షల ఆదాయం రాగా, 51,095కిలోమీటర్లు బస్సులు ప్ర యాణించాయి. ఆదాయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజియన్‌లో ప్రథమస్థానం, రాష్ట్రంలో ఐదో స్థానం సాధించింది. ఈ సందర్భంగా ఉద్యోగులను దేవరకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ తల్లాడ రమే్‌షబాబు అభినందించారు.
సంస్థకు అధిక ఆదాయం రావడం సంతోషం : రాజశేఖర్, ఆర్‌ఎం, నల్లగొండ రీజియన్
రక్షాబంధన్ సందర్భంగా నల్లగొండ రీజియన్ పరిధిలో అత్యధిక ఆదాయం సమకూరడం సంతోషకరం. మహాలక్ష్మి కింద మహిళలు పెద్ద సంఖ్యలో ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. రికార్డుస్థాయిలో ఆదాయం రావడం ఉత్సాహపరిచింది. రానున్న రోజుల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు కల్పిస్తూ సంస్థను అగ్రభాగాన నిలబెడుతాం. ఉద్యోగులు అధికారులు, అందరి సహకారంతో సంస్థ లాభాల బాటలో నడుస్తోంది.
మూడు రోజుల్లో రీజియన్ పరిధిలో ఆదాయం ఇలా..
డిపో 17న 18న 19 మొత్తం
దేవరకొండ 51,345 54,411 68,457 1,74,213
కోదాడ 33,315 34,551 45,894 1,13,760
మిర్యాలగూడ 40,941 45,777 64,693 1,51,411
నల్లగొండ 50,969 51,180 63,191 1,65,340
నార్కట్‌పల్లి 9,315 9,838 11,188 30,341
సూర్యాపేట 64,638 61,099 73,979 1,99,716
యాదగిరిగుట్ట 43,408 46,519 51,580 1,41,507
మొత్తం 2,98,951 3,04,372 3,78,982 9,82,305
మహాలక్ష్మి ప్రయాణికులు 1,84,346 1,85,771 2,52,506 6,22,623
ఆదాయం రూ.1,89,11,000 రూ.2,0249,000 రూ.2,55,03,000 రూ.6,46,63,000
1.50లక్షలకు పైగా రాకపోకలు
హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ
చౌటుప్పల్ రూరల్, చౌటుప్పల్ టౌన్, ఆగస్టు 20: వరుస సెలవులతో హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసింది. ఆగస్టు 15వ తేదీనుంచి ప్రారంభమైన వాహనాల రద్దీ మంగళవారం వరకు కొనసాగింది. స్వాతంత్య్ర దినోత్సవం, శ్రావణ శుక్రవారం, శనివారం, ఆదివారం, రాఖీ పండుగలతో జాతీయరహదారి సందడిగా మారింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ మీదుగా మూడు రోజుల్లో 1.50లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించాయి. సాధారణ రోజుల్లో 35వేలకు పైగా వాహనాల రాకపోకలు సాగిస్తుండగా సెలవుల నేపథ్యంలో శనివారం 48వేలు, ఆదివారం 51వేలు, సోమవారం 50వేల వాహనాలు రాకపోకలు సాగించినట్లు టోల్‌ప్లాజా నిర్వాహకులు తెలిపారు. ఇందులో కార్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవిగాక బైక్‌లు, ఆటోలు, బస్సుల్లో ప్రజలు గ్రామాలకు వెళ్లారు. చౌటుప్పల్ పట్టణంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం వాహనాల రద్దీ కొనసాగింది. మూడు, నాలుగు వరసలుగా కార్లు నగరానికి పరుగులు తీస్తున్నాయి. పట్టణంలోని హైవేపైన ఉన్న మూడు జంక్షన్ల వద్ద కూడా వాహనాలను ట్రాఫిక్ పోలీసులు కొద్దిసేపు నిలిపి పంపిస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులతో బస్‌స్టేషన్ ప్రాంగణం రద్దీగా మారింది.