Share News

హోటళ్ల యజమానులకు 2.50లక్షల జరిమానా

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:37 AM

నాణ్యతలేని కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్న హోటల్స్‌పై అధికారులు గత నెల జిల్లాలోని పలు హోటల్స్‌పై జిల్లా ఆహార భద్రత అధికారులు ఆకస్మిక దాడులు చేసి సేకరించిన శాంపిల్స్‌కు ల్యాబ్‌లలో నిర్వహించిన నాణ్యత పరీక్షల్లో 10 హోటళ్లలో కల్తీ ఆహారం విక్రయిస్తున్నట్టు తెలిసింది.

హోటళ్ల యజమానులకు 2.50లక్షల జరిమానా

భువనగిరి టౌన, ఏప్రిల్‌ 29: నాణ్యతలేని కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్న హోటల్స్‌పై అధికారులు గత నెల జిల్లాలోని పలు హోటల్స్‌పై జిల్లా ఆహార భద్రత అధికారులు ఆకస్మిక దాడులు చేసి సేకరించిన శాంపిల్స్‌కు ల్యాబ్‌లలో నిర్వహించిన నాణ్యత పరీక్షల్లో 10 హోటళ్లలో కల్తీ ఆహారం విక్రయిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఆ హోటళ్ల యజమానులకు అదనపు కలెక్టర్‌ పి.బెనషాలోమ్‌ రూ.2.50 లక్షలు జరిమానా విధించారు. సోమవారం భువనగిరి పట్టణంలోని పలు హోటళ్లలో ఆహార భద్రత డిజిగ్నేటెడ్‌ అధికారి డాక్టర్‌ ఎం.సుమనకళ్యాణ్‌, జిల్లా ఆహార భద్రత అధికారి స్వాతి ఆధ్వర్యంలో మరోమారు ఆకస్మిక తనిఖీలు చేసి, శాంపిల్స్‌ను సేకరించారు. హోటల్స్‌ నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 30 , 2024 | 08:23 AM