Share News

మేడారం జాతరకు 224 బస్సులు

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:16 AM

తెలంగాణ కుంభమేళా.. మేడారం సమక్క, సారలమ్మ జాతరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా బస్సులు బయలుదేరి వెళ్లనున్నాయి. ఖమ్మం, వరంగల్‌ రీజియన్‌లనుంచి ఈ బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మేడారం జాతరకు 224 బస్సులు

వరంగల్‌, ఖమ్మం రీజియన్లకు తరలింపు

ఈ నెల 18 నుంచి 25 వరకు నడవనున్న బస్సులు

భక్తుల ఇంటికే పసుపు, కుంకుమ, ప్రసాదాలు

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా బుకింగ్‌ సౌకర్యం

మహిళలకు ఉచితంగానే ప్రయాణం

నల్లగొండ: తెలంగాణ కుంభమేళా.. మేడారం సమక్క, సారలమ్మ జాతరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా బస్సులు బయలుదేరి వెళ్లనున్నాయి. ఖమ్మం, వరంగల్‌ రీజియన్‌లనుంచి ఈ బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 25 వరకు రీజియన్‌లో ఏడు డిపోల పరిధి నుంచి మొత్తం 224 బస్సులను ఆ రీజియన్‌ల ద్వారా నడపనున్నారు. జాతరకు లక్షలాది మంది భక్తులు వెళ్లనున్న నేపథ్యంలో ఆర్టీసీ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. బస్సులను ప్రణాళికాబద్ధంగా నడపడంకోసం కార్యాచరణ రూపొందించి, అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగే మేడారం జాతర ఈ నెల 21వ తేదీ నుంచి 24వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో జాతరకు బస్సులను ఈ నెల 18నుంచే నడపనున్నారు. రీజియన్‌కు చెందిన బస్సులను వరంగల్‌ రీజియన్‌కు 130, ఖమ్మం ఆర్టీసీ రీజియన్‌కు 94 బస్సులను కేటాయించారు. ఆ రెండు జిల్లాల నుంచి మేడారం జాతరకు బస్సులను నడిపిస్తారు. ఆయా జిల్లాల నుంచి ఆర్టీసీ అధికారులు బస్సులను నడిపిస్తారు. రీజియన్‌కు చెందిన బస్సులతోపాటు డ్రైవర్లు, కండక్టర్లను సైతం ఖమ్మం, వరంగల్‌ రీజియన్‌లకు పంపిస్తున్నారు.

జాతరకు మహిళలకు ఉచిత ప్రయాణమే

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద డిసెంబరు 9వ తేదీ నుంచి పల్లె వెలు గు, ఎక్స్‌ప్రె్‌సల ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే మేడారం జాతరకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందా? లేదా? అన్న చర్చ సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆర్టీసీ సంస్థ మేడారం జాతరకు కూడా ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మేడారానికి పెద్దఎత్తున మహిళలతోపాటు పురుషులు తరలి వెళుతున్న విష యం తెలిసిందే. ఈ నెల 18 నుంచి ఖమ్మం, వరంగల్‌ మీదుగా మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడవనున్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నా యి. ఈనేపథ్యంలో అందుకనుగుణంగా ఏర్పాట్లను చేస్తున్నారు.

ఎనిమిది రోజులు తప్పని ఇబ్బందులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు డిపోల నుంచి 224 బస్సులను మేడారం జాతర కోసం వరంగల్‌, ఖ మ్మం రీజియన్‌కు తరలిస్తున్న నేపథ్యంలో ఎనిమిది రోజులపాటు ఉమ్మడి జిల్లాలో బస్సుల సంఖ్య తగ్గి ప్ర యాణికులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. రీజియన్‌లో 224 బస్సులు ఆ జిల్లాలోకి వెళితే ఎనిమిది రోజులపాటు ఉమ్మడి జిల్లాలో 48 సూపర్‌ లగ్జరీ బస్సులు, 70 డీలక్స్‌ బస్సులు, 14 పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు మాత్రమే తిరగనున్నాయి. వీటికితోడు 246 అద్దెబస్సులతో కలిసి మొత్తం 378 బస్సులు అందుబాటులో ఉంటాయి. సూప ర్‌ లగ్జరీ, డీలక్స్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం లేనందున 246 అద్దె బస్సులు, మరో 14 పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మాత్రమే ఆ ఎనిమిది రోజు లు మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం ఉంటుంది. దీంతో మహిళా ప్రయాణికులు కూడా రీజియన్‌ పరిధి లో తిరగడం కష్టమయ్యే అవకాశాలున్నాయి. రీజియన్‌లో 224 బస్సులు ఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగుకు సంబంధించినవే. దీంతో మహిళా ప్రయాణికులకు కూడా ఎనిమిది రోజులపాటు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.

భక్తుల ఇంటికే పసుపు, కుంకుమ, ప్రసాదం

సమ్మక్క, సారలమ్మ భక్తులకు ఆర్టీ సీ కార్గో ద్వారా భక్తుల ఇంటికే పసు పు, కుంకుమ, ప్రసాదాలను చేరవేయనుంది. ఇందుకుగాను దేవాదా య శాఖతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. ఈ నెల 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా అమ్మవారి ప్రసాదాన్ని బుకింగ్‌ చేసుకు నే సౌకర్యాన్ని భక్తులకు కల్పించింది. భక్తులు రూ.299 చెల్లించి సమీపంలోని టీఎ్‌సఆర్టీసీ లాజిస్టిక్‌ (కార్గో) కౌంటర్ల లో ఏజెంట్లు, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ల ద్వారా మేడారం ప్రసాదాన్ని బుక్‌ చేసుకోవచ్చు. ఈ ప్రసాదం బుకింగ్‌ సౌక ర్యం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉంటుం ది. బుక్‌ చేసుకున్న భక్తులకు మేడారం జాతర అనంతరం నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని పంపించనున్నారు. రీజియన్‌లోని అన్ని డిపోల పరిధిలో విధులు నిర్వహించే ఎగ్జిక్యూటివ్‌లను సందర్శించి ఆర్డర్‌ను ఇచ్చే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ సమయంలో భక్తులు తమ చిరునామాతోపాటు పిన్‌కోడ్‌, ఫోన్‌నెంబర్‌ను నమోదు చేయాలి.

ఏర్పాట్లు పూర్తి చేశాం..: ఎస్‌.శ్రీదేవి, ఆర్‌ఎం, నల్లగొండ రీజియన్‌

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు మేడారం జాతర కోసం 224 బస్సులను కేటాయించాం. వరంగల్‌ రీజియన్‌కు 130, ఖమ్మం రీజియన్‌కు 94 బస్సులను కేటాయించాం. ఆ రెండు ఆర్టీసీ రీజియన్‌కు బస్సులతోపాటు డ్రైవర్లు, కండక్టర్లను కూడా పంపించడం జరుగుతుంది. మేడారం జాతరకు నడిపే బస్సుల్లో కూడా మహిళలకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఉంటుంది. అదే విధంగా ప్రసాదం బుకింగ్‌ చేసుకునే వారికి ఆర్టీసీ ద్వారా వారికి చేరవేయడం జరుగుతుంది.

డిపోల వారీగా జాతరకు కేటాయించిన బస్సులు

డిపో పల్లెవెలుగు ఎక్స్‌ప్రెస్‌

నల్లగొండ 28 02

దేవరకొండ 36 18

నార్కట్‌పల్లి 02 0

మిర్యాలగూడ 18 02

యాదగిరిగుట్ట 30 12

కోదాడ 18 05

సూర్యాపేట 28 25

మొత్తం 160 64

Updated Date - Feb 15 , 2024 | 12:16 AM