ఒకే ఆటోలో 16 మంది
ABN , Publish Date - Mar 03 , 2024 | 12:15 AM
ఆ ఆటోలో ఐదుగురికి మించి తరలించవద్దు.. కానీ పాలకవీడు మండల కేంద్రంలో కూలీలను తరలిస్తున్న ఆటోను తనిఖీ చేసిన ఎస్‌ఐ లక్ష్మీనర్సయ్యకు విస్తుపోయేంత మంది కనిపించారు.
ఆ ఆటోలో ఐదుగురికి మించి తరలించవద్దు.. కానీ పాలకవీడు మండల కేంద్రంలో కూలీలను తరలిస్తున్న ఆటోను తనిఖీ చేసిన ఎస్‌ఐ లక్ష్మీనర్సయ్యకు విస్తుపోయేంత మంది కనిపించారు. ఏకంగా ఆటోలో 16 మంది ఉన్నారు. పరిమితికి మించి తరలిస్తుండటంతో ఆటో డ్రైవర్‌ను మందలించారు. పంట ఏరేందుకు నల్లగొండ జిల్లా దామరచర్ల మండలానికి కూలీలను తరలిస్తున్నట్లు డ్రైవర్ తెలిపారు. మరోసారి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి మరో ఆటోలో కూలీలను తరలించారు. డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు ప్రమాదాలపై కౌన్సిలింగ్ ఇచ్చారు.
- పాలకవీడు