TS News: మొయినాబాద్ యువతి మృతి మిస్టరీలో కొత్త ట్విస్ట్
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:38 PM
మొయినాబాద్ యువతి మృతి మిస్టరీలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. మృతి చెందిన యువతిని మల్లెపల్లికి చెందిన తైసిన్‌గా అధికారులు గుర్తించారు. తైసిన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రంగారెడ్డి : మొయినాబాద్ యువతి మృతి మిస్టరీలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. మృతి చెందిన యువతిని మల్లెపల్లికి చెందిన తైసిన్‌గా అధికారులు గుర్తించారు. తైసిన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్లెపల్లి నుంచి మొయినాబాద్ వరకూ ఆమె వచ్చింది. ఆత్మహత్యకు ముందు కుటుంబ సభ్యులకు ఫోన్ కూడా చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. గతంలో కూడా తైసిన్ ఆత్మహత్యాయత్నం చేసినట్టు సైతం తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో పాటు కుటుంబ కలహాలతో తైసిన్ బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.