Share News

హెచ్‌ఐవీ రహిత సమాజ నిర్మాణానికి కృషి

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:37 PM

జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి డానియల్‌

హెచ్‌ఐవీ రహిత సమాజ నిర్మాణానికి కృషి
హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిర్మూలనపై నిర్వహించిన పోటీల విజేతలతో కళాశాల అధ్యాపకులు, ఎయిడ్స్‌ నియంత్రణ అధికారులు

సంగారెడ్డి అర్బన్‌, ఫిబ్రవరి 13: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి డానియల్‌ సూచించారు. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సానుకూల వ్యక్తుల పట్ల వివక్ష చూపడం ఎయిడ్స్‌ మహమ్మారి వ్యాప్తి చెందడానికి సహాయపడుతుందన్నారు. 2030 నాటికి ఎయిడ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. అనంతరం యువతి, యువకులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం, క్విజ్‌ కాంపిటేషన్‌లో విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ రత్నప్రసాద్‌, ఉమ్మడి జిల్లా కార్యక్రమ అధికారి కిరణ్‌కుమార్‌, అధ్యాపకులు, ఎన్‌వైకే వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 11:37 PM