బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా
ABN , Publish Date - Mar 03 , 2024 | 11:36 PM
జహీరాబాద్, మార్చి 3: తాను బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతానని, కాంగ్రె్‌సలో చేరుతానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు పేర్కొన్నారు.
పార్టీ మారుతానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం
జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు
జహీరాబాద్, మార్చి 3: తాను బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతానని, కాంగ్రె్‌సలో చేరుతానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు పేర్కొన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధినేత, మంత్రులు తనను అన్నివిధాలుగా ఆదుకున్నారని, అలాంటి పార్టీని వదిలి వేరే పార్టీలో చేరుతానంటు వస్తున్న ప్రచారాలు సరికాదన్నారు. కొందరు పనిగట్టుకుని లేనిపోని ప్రచారాలు చేస్తూ ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారికి దూరంగా ఉండాలన్నారు. తానైతే బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతూ పార్టీ పటిష్టత, జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఎవరో చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. ప్రచారం చేసేవారు ముందుకు వచ్చి తనను ప్రశ్నిస్తే సమాధానం ఇస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత హయాంలో జహీరాబాద్ ప్రాంతం అన్నిరంగాల్లో ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. కాలం గడిచే కొద్ది, జనాభా పెరుగుతున్న కొద్ది సమస్యలు పెరుగుతుంటాయని, ప్రజల సహకారంతో వాటన్నింటిని అంచలంచెలుగా పరిష్కరించుకుందామని చెప్పారు. జహీరాబాద్ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.