Share News

రికార్డుల నిర్వహణలో లోపాలు ఉండొద్దు

ABN , Publish Date - May 31 , 2024 | 12:10 AM

కూలీల సంఖ్య పెంచేందుకు ప్రతీ అధికారి కృషి చేయాలి డీఆర్డీవో అదనపు పీడీ బాలకృష్ణ

రికార్డుల నిర్వహణలో లోపాలు ఉండొద్దు
ఓపెన్‌ ఫోరంలో మాట్లాడుతున్న బాలకృష్ణ

సిద్దిపేట రూరల్‌, మే30: ఉపాధిహామీ పనుల వివరాల రికార్డుల నిర్వహణలో లోపాలు లేకుండా చూసుకోవాలని డీఆర్డీవో అదనపు పీడీ బాలకృష్ణ సూచించారు. సిద్దిపేట రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం ఉపాధిహామీ పథకం సోషల్‌ ఆడిట్‌ ఓపెన్‌ ఫోరమ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023-2024 సంవత్సరంలో జరిగిన రూ.3 కోట్ల 31 లక్షల 62వేల విలువ పనులపై సోషల్‌ ఆడిట్‌ నిర్వహించామని తెలిపారు. రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరులో లోపాలను గుర్తించి రూ28,893 జరిమాన విధించి, వసూళుకు అదేశించింనట్లు పేర్కొన్నారు. కూలీల సంఖ్య పెంచి, తగిన విధంగా పనులు గుర్తించి పని కల్పించాలన్నారు. వచ్చే హరితహారం కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎపీడీ శివాజీ, డీవీవో ప్రభాకర్‌, ఎంపీడీవో రాఘవేందర్‌రెడ్డి, సోషల్‌ ఆడిట్‌ ఎస్‌టీఎం దత్తు, ఇన్‌చార్జి ఎపీవో శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శులు, ఫిల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 09:59 AM